కూల్ గా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది పెళ్లి చూపులు! ఒక సెన్సిబుల్ తెలుగు సినిమాగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రంతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమాతోనే బాగా పరిచయం ఉన్న నటుడిగా ప్రేక్షకులకు దగ్గరైపోయాడు అనడంలో సందేహం లేదు. ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో విజయ్ నటుడిగా పరిచయం అయ్యాడు. తాజా చిత్రం హిట్ కావడంతో మాంచి క్రేజు సంపాదించుకున్నాడు. దాదాపు రూ. 1 కోటి లోపలే తెరకెక్కిన పెళ్లి చూపులు... కనీసం రూ. 10 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రం కలెక్షన్స్ బాగానే ఉన్నాయని అంటున్నారు. దీంతో విజయ్ కు మార్కెట్ బాగా పెరిగిందని చెప్పుకోవాలి. హీరోగా విజయ్ పేరు ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. చాలామంది దర్శక నిర్మాతలు విజయ్ను కాంటాక్ట్ చేస్తున్నారట. అయితే, ప్రస్తుతం విజయ్ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిల్లో ఒక చిత్రం... అర్జున్ రెడ్డి! దీనికి సంబంధించిన కిస్సింగ్ వీడియో ఆ మధ్య యూట్యూబ్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.
అర్జున్ రెడ్డి చిత్రాన్ని రూ. 4 నుంచి 5 కోట్ల బడ్జెట్ లో పూర్తి చేద్దాం అనుకున్నారట. అయితే, పెళ్లి చూపులు హిట్ కావడంతో దీని బడ్జెట్ ను అమాంతంగా పెంచేశారని తెలుస్తోంది. రూ. 6 కోట్లు దాటిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. సూపర్ గుడ్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న మరో చిత్రంలో కూడా విజయ్ హీరోగా నటిస్తున్నాడు. దీన్ని కూడా రూ. 4 కోట్లలో తీయాలని మొదట ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్ర బడ్జెట్ కూడా కొంత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరుగుతున్న బడ్జెట్ లో ఎక్కువ మొత్తాన్ని ప్రచారం కోసం కేటాయించబోతున్నట్టు సమాచారం. పెళ్లి చూపుల హిట్ తో విజయ్ కు మాంచి మార్కెట్ వచ్చిందనీ, కాబట్టి బడ్జెట్ ను కొంత పెంచినా ఫర్వాలేదన్న ధీమాతో నిర్మాతలు ఉన్నట్టు చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి. విజయ్ ప్రస్తుతం ఇటలీలో ఉన్నాడు. తదుపరి చిత్రం షూటింగ్ జరుగుతోంది.