బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ ఉంటుందట

Update: 2018-06-09 01:30 GMT
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హీరో ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత ఏడాది సంచలనం సృష్టించిన ఆ సినిమా క్రేజ్ తోనే విజయ్ ఇంకా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మధ్యలో ఏ మంత్రం వేసావే అనే సినిమా వచ్చినా అది కెరీర్ స్టార్టింగ్ లో ఓకే చేసిన సినిమా కావడంతో రిలీజ్ చేయక తప్పలేదు. విజయ్ ఆ సినిమాను పట్టించుకోకపోవడంతో  ఆ సినిమా విడుదలైనట్టు కూడా ఎవరికీ తెలియదు.

ఇకపోతే ఈ ఏడాది మహానటి సినిమాతో మళ్లీ ఓ విధంగా సక్సెస్ కొట్టిన హీరోగానే క్రెడిట్ అందుకున్నాడు. ఫైనల్ గా విజయ్ నుంచి ఒక మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఒక్క సినిమా కాదు రెండు సినిమాలు చూడచ్చు. నెల గ్యాప్ లో విజయ్ నెక్స్ట్ రెండు ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయి. టాక్సీ వాలా  అయితే ఈ సమ్మర్ లోనే రిలీజ్ కావాలి కానీ గ్రాఫిక్స్ పనుల ఆలస్యం వలన వాయిదా పడింది.

ఇక పరశురామ్ డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ ఒక సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా త్వరలోనే రానుంది. మొత్తంగా నెక్స్ట్ వీక్ లో టాక్సీ వాల డేట్ ఫిక్స్ కానుంది. రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రానున్నాయి. ఇక ఈ సినిమాల తరువాత నోటా అనే తెలుగు - తమిళ్  ద్విభాషా చిత్రంలో ఈ హీరో నటించనున్నాడు. అలాగే డియర్ కామ్రేడ్ సినిమాను ఒకే చేసిన విజయ్ ఈ రెండు సినిమాలను నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేయనున్నాడు.      
Tags:    

Similar News