రూ.199 విలువైన చెప్పులతో విజయ్ దేవరకొండ..!

Update: 2022-07-22 13:24 GMT
సెన్సేషనల్ స్టార్‌ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలతోనే కాకుండా రియల్ లైఫ్ యాటిట్యూట్ తో ఆకట్టుకొని యూత్ ఐకాన్ గా పిలవబడుతున్నాడు. స్టైలింగ్ లోనూ విజయ్ ను అనుసరించేవారు ఎక్కువగానే ఉన్నారు. అతని ఫ్యాషన్ ఎంపికలు అతని వలె బోల్డ్ గా ఉంటాయి. ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసినా సరికొత్తగా కనిపించడం VD ప్రత్యేకత. అందుకే అతన్ని స్టైల్ ఐకాన్ గా భావిస్తారు.

విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రం ''లైగర్'' తో సంచలనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే బాలీవుడ్ లో అందరి ఫేవరేట్ గా మారిపోతున్నాడు. లేటెస్టుగా ట్రైలర్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు వీడీ.

'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ మరియు ముంబై నగరాల్లో గ్రాండ్ గా నిర్వహించారు. అంధేరీలోని సినీ పోలిష్ లో జరిగిన ఈవెంట్‌ లో VD స్టైలింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. మామూలు చెప్పులు మరియు కార్గో ప్యాంట్‌ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఇదే బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

'లైగర్' ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ రణ్‌ వీర్ సింగ్ గెస్టుగా హాజరయ్యారు. ఫ్యాషన్ ఐకాన్ రణ్వీర్ ఎప్పటిలాగే ట్రెండీ కాస్ట్యూమ్స్ లో కనిపించగా.. విజయ్ దేవరకొండ మాత్రం సాధారణ దుస్తులలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఒక హీరో బాలీవుడ్ లో జరిగే ఒక ఈవెంట్ కు ఇలా సింపుల్ గా హవాయి చెప్పులు వేసుకొని వెళ్లాలంటే నిజంగా చాలా ధైర్యం కావాలి.

అయితే విజయ్ స్టైలింగ్ గురించి అతని స్టైలిస్ట్ హర్మాన్ కౌర్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ముంబై ఈవెంట్ వీడీ వేసుకున్న చెప్పులు కేవలం 199 రూపాయల బేసిక్ స్లిప్పర్స్‌ అని తెలిపారు. 'లైగర్' ప్రమోషన్డ్ లో విజయ్ కోసం కన్స్ట్రక్షన్ డిజైన్ లుక్స్ కోసం చాలా బ్రాండ్‌లు డిజైనర్లు ఫాలో అప్ చేస్తుంటే.. అతను ఓ  రోజు పిలిచి సినిమాలో పాత్రకు దగ్గరగా ఉండేలా అండర్‌ డాగ్ లుక్‌ లో ఉంచుదామని చెప్పినట్లు స్టైలిస్ట్ హర్మాన్ వెల్లడించారు.

VD బేసిక్ చప్పల్స్ కోసం నన్ను అడిగినప్పుడు మొదట్లో నేను కొంచెం సంకోచించాను.. కానీ అతని డ్రెస్సింగ్ ఆలోచనలను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. ఎందుకంటే అతను దాన్ని దేశంలో చర్చనీయాంశంగా మారుస్తాడని నాకు తెలుసని స్టైలిష్ చెప్పుకొచ్చారు. విజయ్ - టీమ్ రౌడీ వేర్ మరియు నేను కలిసి చాలా తక్కువ సమయంలో కాస్ట్యూమ్స్ రెడీ చేసారని తెలిపారు.

'లైగర్' ఈవెంట్ పెద్ద ఎత్తున అది కూడా ముంబైలో జరుగుతున్నందున.. రూ. 199 విలువ చేసే చప్పల్స్ ధరించి నడవడానికి విజయ్‌ కి నిజంగా ధైర్యసాహసాలు కావాలి. దీని గురించి నేను నిరంతరం నెర్వస్ గా ఫీలయ్యా. అయితే ఇది చాలా ప్రేమతో స్వీకరించబడినందుకు నేను సంతోషిస్తున్నాను అని స్టయిలిష్ట్ హర్మాన్ చెప్పుకొచ్చింది. హర్మాన్ విజయ్ దేవరకొండ తోపాటుగా అల్లు అర్జున్‌ కి కూడా వ్యక్తిగత స్టైలిస్ట్ గా వ్యవహరించారు.

ఇదిలా ఉంటే 'లైగర్' చిత్రాన్ని ఆగస్ట్ 25న పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ఎంఎంఏ బాక్సర్ గా కనిపించనున్నారు. ఇందులో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా.. దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. పూరీ కనెక్ట్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Tags:    

Similar News