టాలీవుడ్ లో వున్న ప్రతీ హీరోకు ఓ సెంటిమెంట్ వున్నట్టే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు కూడా ఓ సెంటిమెంట్ వుంది. అదే ఆగస్టు సెంటిమెంట్. ఇప్పడు అదే సెంటిమెంట్ తో తను నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'లైగర్'ని ఆగస్టులో రిలీజ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ 'లైగర్'. పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ డేట్ కో ప్రత్యేకత వుంది. దాదాపు ఐదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా విడుదలైన మూవీ 'అర్జున్ రెడ్డి'. సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీ 2017 ఆగస్టు 25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. పాత్ బ్రేకింగ్ మూవీగా, టాలీవుడ్ గేమ్ ఛేంజర్ గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది. ఇంగ్లీష్ టైటిల్, మూడు గంటలకు మించి నిడివి, సినిమాటిక్ బారియర్స్ కు అవేగా వెళ్లి చేస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ఇలా పలు రకాలుగా సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
విజయ్ దేవరకొండని స్టార్ ని చేసి అతనికి టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టింది. స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. ప్రతీ హీరో కెరీర్ లో ఇన్ని వేరియేషన్స్ వున్న క్యారెక్టర్ లభించడం చాలా అరుదు.
అలాంటి అర్జున్ రెడ్డి పాత్రతో ప్రతీ ఒక్క ప్రేక్షకుడినే కాకుండా విజయ్ దేవరకొండ ప్రతీ టాలీవుడ్ స్టార్ ని షాక్ గురిచేశాడు. ఈ మూవీ చూశాక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారం రోజులు పాటు షాక్ లో వుండిపోయారంటే ఈ మూవీ టాలీవుడ్ పై ఎంత ఇంపాక్ట్ కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్, మహేష్, చిరంజీవి.. ఇలా చాలా మంది హీరోలు విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించారు.
అతని కెరీర్ ని కీలక మలుపు తిప్పిన ఈ మూవీ టాలీవుడ్ లో ఇంగ్లీష్ టైటిల్స్ కి, మూడు గంటల పై చిలుకు నిడివికి కేరాఫ్ అడ్రస్ గా నిలవడమే కాకుండా ఈ ఫార్మాట్ ని చాలా మంది హీరోలు ఫాలో అయ్యేలా ప్రభావితం చేసింది. సినిమాటిక్ బారియర్స్ ని బ్రేక్ చేసిన 'అర్జున్ రెడ్డి' విడుదలైన రోజునే మళ్లీ ఐదేళ్ల తరువాత 'లైగర్'తో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై సినిమాపై బజ్ ని క్రియేట్ చేసింది.
ఈ మూవీతో ఇదే ఏడాది విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా విడుదలవుతున్న ఈ మూవీతో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ భారీ విజయాన్ని ఆశిస్తున్నారు. విజయ్ కెరీర్ ని మార్చిన 'అర్జున్ రెడ్డి' సెంటిమెంట్ 'లైగర్' విషయంలో రిపీట్ అవుతుందా? .. 'లైగర్' విషయంలో మళ్లీ ఆ మ్యాజిక్ జరుగుతుందా? అన్నది తెలియాలంటే ఆగస్టు 25 వరకు వేచి చూడాల్సిందే.