విజయ్ 'దశ' తిరిగిందా..?

Update: 2018-08-25 05:09 GMT
టాలీవుడ్ నవసంచలనం విజయ్ దేవరకొండ.. రాకెట్ స్పీడ్ తో దూసుకుకెళ్తున్నాడు. మరో రెండు సినిమాలు ‘అర్జున్ రెడ్డి - గీతగోవిందం’ తరహాలో విజయాలు సాధిస్తే.. మిగతా యంగ్ హీరోలకు కచ్చితంగా థ్రెట్ గా మారతాడు. ఇప్పటికే నానీ - శర్వానంద్ - నితిన్ లాంటి హీరోలకు విజయ్ ఏకులా వచ్చి మేకయ్యాడనే  టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి పారితోషికాన్నీ దానికి తగినట్టుగానే ఓ రేంజ్ లో పెంచేశాడని వినికిడి. లేటెస్ట్ సెన్సేషన్ ‘గీత గోవిందం’ చిత్రం తో విజయ్ తన పారితోషికాన్ని 10కోట్లకు పెంచాడని తెలుస్తోంది.

ఇప్పటి జెనరేషన్ కుర్రగాళ్లకు విజయ్ స్టైల్  - స్మైల్ - డైలాగ్ డెలివరి - యాక్టింగ్ భలేగా నచ్చేస్తున్నాయి. అతడు ఇప్పటి యూత్ కు స్టైల్ ఐకాన్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం మూడే మూడు సినిమాలతో ఇంత వేగంగా స్టార్ డమ్ ను తెచ్చుకున్న హీరో అయితే ఈ మధ్యకాలంలో ఎవరూ లేరనే చెప్పాలి. ప్రస్తుతం విజయ్ తో సినిమాలు తీయడానికి ఎంతో మంది నిర్మాతలు క్యూ కడుతున్నారు. అతడితో సినిమా అంటే  మినిమమ్ గ్యారెంటీ హిట్ కాబట్టి..  10కోట్లు ఏంటి? ఎంతైనా ఇవ్వడానికి  ముందుకొస్తున్నారు.

ఎన్నో ఏళ్లనుంచీ ఎంతో కష్టపడితే - ఇప్పటికి  రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాతో 10.5 కోట్లు పారితోషికం అందుకోగలిగాడు. అలాంటిది విజయ్  మూడే మూడు సినిమాలతోనే ఆ ఫీట్ ను సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్‌ - యన్టీఆర్ - ప్రభాస్ - అల్లు అర్జున్ - రామ్ చరణ్‌ లాంటి హీరోలు 15 నుంచి 25 కోట్లు చొప్పున పారితోషికం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రం ఘన విజయంతో 10 కోట్లకు తన పారితోషికాన్ని పెంచేసి.. తాను కూడా త్వరలోనే ఆ హీరోలతో సరి సమానంగా పారితోషికాన్ని అందుకోగలనని  హింట్ ఇస్తున్నాడని అనుకోవాలి.  ‘గీత గోవిందం’ చిత్రం 50కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధంగా ఉంది. త్వరలో 100 కోట్ల క్లబ్ లోకి చేరినా ఆశ్చర్యంలేదు. సో.. విజయ్ దేవరకొండ  ‘దశ’ తిరిగినట్టే.
Tags:    

Similar News