దీపం ఉండగానే చక్క దిద్దుకోవాలి! ఛాన్స్ దొరికినప్పుడే చుట్టబెట్టాలి. తెలివిగా ఆలోచింకపోతే ఈ రంగుల ప్రపంచంలో ఎవరి సన్నివేశం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. సక్సెస్ అందివచ్చినప్పుడు దానిని ఖాతాలోకి మళ్లించడం తెలిసి ఉండాలి. యంగ్ ట్యాలెంటెడ్ హీరో .. నైజాం నవాబ్ విజయ్ దేవరకొండ ప్లాన్ అలానే ఉంది మరి. టాలీవుడ్ - కోలీవుడ్ లో క్రేజీ బ్యానర్లకు మాత్రమే ఓకే చెబుతూ తెలివైన ఆట ఆడుతున్న దేవరకొండ.. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో - తమిళనాడులో భారీ ఫ్యాన్ బేస్ ని పెంచుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాడు. తన స్టార్ డమ్ ని.. స్థాయిని ఎలివేట్ చేసే రేంజులో భారీ ఈవెంట్లతో మోత మోగిస్తున్నాడు. `గీత గోవిందం` టైమ్ లో గీతా ఆర్ట్స్ బాస్ అల్లు అరవింద్ - మెగాస్టార్ చిరంజీవి వంటి వారు దేవరకొండకు బోలెడంత ప్రమోషనల్ సాయం చేశారు. ఇప్పుడు `నోటా` సీజన్ రన్ అవుతోంది కాబట్టి.. దేవరకొండకు స్టూడియోగ్రీన్ బాస్ జ్ఞానవేల్ అండా దండా ఇప్పుడు పెద్ద ప్లస్ కానున్నాయి.
సెప్టెంబర్ 30 - అక్టోబర్ 1 .. ఈ రెండు తేదీల్ని దేవరకొండ `ది నోటా పబ్లిక్ మీట్` పేరుతో ప్రమోషనల్ ఈవెంట్ల కోసం లాక్ చేశాడు. సెప్టెంబర్ 30న విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ ని బుక్ చేశాడు. ఆరోజు భారీ ఎత్తున దేవరకొండ తెలంగాణ ఫ్యాన్స్ బెంజి సర్కిల్ ని చుట్టుముట్టనున్నారని తెలుస్తోంది. ఏపీలో తడాఖా ఏంటో చూపించడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్ధేశం. అటుపై అక్టోబర్ 1న హైదరాబాద్- యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ ఈవెంట్ ఉంటుంది. ఈ ఈవెంట్ కోసం ఏకంగా లక్ష మంది అభిమానుల్ని మోహరిస్తున్నారట. మొత్తానికి స్టార్ డమ్ లెవల్ ని చూపించగలిగితే ఆ మేరకు థియేటర్లకు జనాల్ని పుల్ చేయొచ్చనేది ప్లాన్.
మరోవైపు తమిళనాడు ప్రమోషన్స్ లోనూ దేవరకొండ దుమ్ము దులిపేస్తున్నాడు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ కంటే ఈసారి చెన్నయ్ - తమిళ్ నాడులోనే భారీ ప్రమోషన్స్ చేశాడు. ఇప్పటివరకూ అక్కడే బిజీగా ఉన్నాడు దేవరకొండ. అక్కడ మీడియా ఇంటర్వ్యూలో దేవరకొండకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇటీవలే తారక్ ఫ్యాన్స్ నుంచి నోటా రిలీజ్ విషయంలో హీట్ ని ఎదుర్కొన్నారు కదా? అన్న ప్రశ్నకు .. ``తారక్ అన్న సినిమాతో నా సినిమా రిలీజ్ ని ఫ్యాన్స్ వద్దనడం కరెక్ట్ కాదు. సినిమాల్ని సినిమాలుగానే చూడాలి`` అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమిళ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ వ్యాఖ్య పై తారక్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక అమెరికాలోనూ నోటా ప్రమోషన్స్ హోరెత్తిస్తున్నారు. అక్కడ బే ఏరియాలో ప్రమోషన్స్ కి ప్రత్యేకించి `నోటా ప్రమోషన్ కార్స్` బయల్దేరాయి ఇప్పటికే. ఈ కార్ తో సెల్పీ దిగి 50 డాలర్ల విలువ చేసే గిఫ్ట్ కార్డ్ ని సొంతం చేసుకోవచ్చంటూ ప్రచారం హోరెత్తించేస్తున్నారు. ఇన్ని భారీ అంచనాల నడుమ `నోటా` అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.