స్టార్ హీరోల మీద అభిమానం చాటుకునేందుకు పెద్ద పెద్ద కటౌట్లు నిలబెట్టడం, పూల మాలలు వేయడం.. పాలతో అభిషేకం చెయ్యడం సాధారణ విషయమే. పాలతో అభిషేకం చేయడంపై కొంతమంది జనాలు ఇంతెత్తున లేచి విమర్శలు చేస్తుంటారు. ఆ పాలను వేస్ట్ చేయడం కంటే ఎవరికైనా ఆకలిగా ఉన్నవాళ్ళకు ఇవ్వొచ్చు కదా అని. మంచి కాన్సెప్టే గానీ ఈ విమర్శకులు మిస్ అయ్యే లాజిక్ ఏంటంటే.. వీళ్ళు పాలాభిషేకాలు చెయ్యరు కదా. మరి రోజూ ఎన్ని లీటర్ల పాలతో ఎంతమంది ఆకలిని తీరుస్తున్నారో అడగండి! లీటర్ల సంగతి దేవరకొండ ఎరుగు.. కనీసం ఒక మిల్లీ లీటర్ పాలు కూడా చిన్న చీమకు కూడా పొయ్యరు.
మధ్యలో దేవరకొండ ఎందుకు వచ్చాడు? దేవుడు కదా సరైన పదం అనుకోకండి.. ఆయనను ఇప్పుడు దేవుడి లా అనుకొని అయన వీరాభిమానులు క్షీరాభిషేకం చేస్తున్నారు. నిన్నే విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' రిలీజ్ అయింది. అయన క్రేజ్ పీక్స్ లో ఉంది.. ఇక చెప్పేదేముంది. పాలతో అభిషేకం చేసి తమ ఉత్సాహాన్ని, ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలు - వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంతో మంది హీరోలను వాళ్ళ తల్లిదండ్రులు ఆడియన్స్ పై రుద్దుతున్నా వాళ్ళలో కొద్ది మందికి తప్ప ఇలాంటి ఇమేజ్ దక్కదు. మరి విజయ్ దేవరకొండ మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యాడు.
దీంతో ఆడియన్స్ మిగతావాళ్ళు కంటే కాస్త ఎక్కువే అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే 'గీత గోవిందం' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది.