తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరో ఇళయదళపతి విజయ్. దళపతి విజయ్ అంటేనే తమిళనాడు రాష్ట్రము మొత్తం ఊగిపోతోంది. మాములుగా విజయ్ సినిమా వస్తుందంటేనే అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేస్తారు అలాంటిది తమ స్టార్ హీరో పుట్టినరోజు వేడుకలు ఏ రేంజ్ లో చేస్తారో ఊహకే అందట్లేదు కదా.. అయితే ఈ నెల 22న ఇళయదళపతి విజయ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు వేడుకలకు సిద్ధం అవుతూ.. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
అయితే ఇటీవలే విజయ్ పుట్టినరోజు ఫస్ట్ లుక్ కామన్ డీపీ విడుదల చేశారు ఫ్యాన్స్. ఈ ఏడాది విజయ్ 46వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్బంగా విడుదల చేసిన కామన్ డీపీ ట్విట్టర్ లో దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు హీరోల బర్త్డే ట్వీట్ల పై ఉన్న రికార్డులను బద్దలు కొట్టాలని విజయ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. తమ అభిమాన హీరో బర్త్ డే వేడుకలను ఎప్పటికి గుర్తుండే విధంగా చేస్తామని ఫ్యాన్స్ ట్వీట్ల ద్వారా తెలుపుతున్నారు. ప్రస్తుతం విజయ్ కామన్ డీపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ కామన్ డీపీలో ఇళయదళపతి విజయ్ పేరుతో పాటు ఓ సింహాసనం డిజైన్ చేశారు. ఆ సింహాసనంలో విజయ్ కూర్చొని ఉండగా.. ఆయన సింహాసనం చుట్టూ సైనికులు ఖడ్గాలు పట్టుకొని నిలబడి ఉన్నారు. అంటే తమ అభిమాన హీరో విజయ్ కి అభిమానులంతా సైనికులుగా రక్షణగా ఉన్నామంటూ ఆ కామన్ డీపీ ద్వారా తెలియజేస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం నిజంగానే విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇక విజయ్ కి తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
స్నేహితుడు సినిమా నుండి విజయ్ చేసే ప్రతీ సినిమా తెలుగులో కూడా విడుదల అవుతూ ఉంది. తుపాకీ.. అదిరింది.. విజిల్.. ఇలా వరుస హిట్లతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్. ఇక తాజాగా 'మాస్టర్' సినిమాతో సిద్దమవుతున్నాడు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక మరి దళపతి బర్త్ డే సందర్భంగా ఏదైనా టీజర్.. ట్రైలర్ విడుదల చేస్తారేమో అని అభిమానులు ఆశగా ఎదురు చేస్తున్నారు. చూడాలి మరి విజయ్ ఫ్యాన్స్ కి ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారేమో!