కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్టార్డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తమిళ పరిశ్రమలో టాప్ -5 హీరోల్లో అతను ఒకరు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న పెద్ద స్టార్. భారీగా పారితోషికం తీసుకుంటున్న బిగ్ స్టార్స్ లో అతను ఒకరు. విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్ చేసే రచ్చ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. అతని సినిమా రిలీజ్ అవుతుందంటే రాష్ర్టమంతటా భారీ ఎత్తున హడావుడి వాతావరణం నెలకొంటుంది.
ఫ్యాన్ వార్ తో రాష్ర్టం అట్టుడుకుతుంది అన్నభయంతో థియేటర్ల వద్ద భారీ పోలీస్ బందోబస్త్ సైతం ఏర్పాటు చేస్తారు. మరి అంతటి క్రేజీ స్టార్ గా మారడానికి విజయ్ ఎంతగానో శ్రమించారు. అతను తండ్రి నటుడే ఆయినప్పటికీ సొంత ట్యాలెంట్ తోనే పైకి ఎదిగారు. అలాగే తడ్రితో విజయ్ కి గొడవలున్నాయని చాలా కాలంగా వినిపిస్తుంది. ఇద్దరు మాట్లాడుకోరని..ఒకే చోట కలిసి ఉండరని మీడియాలో వార్తలొస్తూనే ఉంటాయి.
తాజాగా విజయ్ ప్రస్తానాన్ని ఉద్దేశించి అతని తండ్రి చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. విజయ్ కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందలు పడ్డాడు. ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాడు. అన్నింటిని తట్టుకుని నిలబడి అంతటి వాడు అయ్యాడు. అతని లుక్స్ బాగోలేవనేవారు. అప్పటికీ విజయ్ హీరోగా నేను ఐదు సినిమాలు చేసా. ఆ తర్వాత బయట అవకాశాలు వచ్చాయి.
మొదట్లో చంద్ర శేఖర్ తనయుడు విజయ్ అనేవారు. ఇప్పుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ అంటున్నారు. అందుకు నేనెంతో గర్విస్తున్నా. ప్రతీ కుటుంబంలోనూ గొడవలుంటాయి. అలాగే మాకుటుంబంలోనూ చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. విజయ్ తో నాకు గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో తరుచూ కథనాలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిని మేము పట్టించుకోం.
మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. విజయ్-నేను రోజూ కలుస్తూనే ఉంటాం. నాకు కాస్త కోపం ఎక్కువ. ఎంత కోపం వచ్చినా అతను నాకు కొడుకు. నేను అతనికి తండ్రిని. అతను ఎప్పుడు బాగుండాలని దేవుడ్నికోరుకుంటా` అని అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.