మహానటి - దేవదాస్ చిత్రాల సక్సెస్ తో జోరుమీదున్నారు వైజయంతి అధినేత అశ్వనిదత్. ఆ సినిమాల ప్రమోషన్స్ టైమ్‌లో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నానని అన్నారు. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఎప్పుడు? అంటే అందుకు ఇప్పటివరకూ సరైన సమాధానం లేదు. ఈలోగానే అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్ సినిమాస్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని ప్రకటించింది. తేరి - మెర్సల్ లాంటి సంచలన విజయాల్ని అందించిన అట్లీ ఇప్పుడు ఇలయదళపతి విజయ్ నటించనున్న 63వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీని అందిస్తామని ఏజీఎస్ సినిమాస్ సంస్థ ప్రకటించింది. ఆ ఏమేరకు నిర్మాతలు ఎస్.కల్పాతి అఘోరం-ఎస్.గణేష్-కల్పాతి ఎస్.సురేష్ బృందం ఈ విషయాన్ని అధికారికంగా మీడియాకి వెల్లడించారు.
2019 దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. మెర్సల్ - సర్కార్ చిత్రాలకు సంగీతం అందించిన ఏ.ఆర్.రెహమాన్ ముచ్చటగా మూడోసారి విజయ్ సినిమాకి సంగీతం అందించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో బిగ్ స్కేల్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కథానాయికను ఫైనల్ చేయాల్సి ఉంది అని తెలిపారు. విజయ్ మెర్సల్ తరహాలోనే మరో భారీ మాస్ ఎంటర్ టైనర్ ని అందిస్తామని ఏజీఎస్ సంస్థ ప్రకటించింది.
ఈ ప్రకటనతో .. అట్లీతో అశ్వనిదత్ కథాచర్చలు ఫలించలేదని - లేదా ఆ ప్రాజెక్టును పెండింగులో ఉంచారని భావించవచ్చు. అట్లీ తో కథాచర్చలు సాగుతున్నాయని - అతడు చెప్పిన లైన్ కి ఓకే చెప్పాక - కథ డెవలప్ చేస్తున్నాడని వైజయంతి అధినేత చెప్పినా ఎందుకనో అది వెంటనే ఓకే కాలేదు. ఇక అశ్వనిదత్ ఇప్పటికే ఎన్టీఆర్ తో ద్విభాషా చిత్రం చేయాలన్న ఆలోచనలోనూ ఉన్నారు. మరి ఎన్టీఆర్ తో - అట్లీతో సినిమాలు ఎప్పటికి కుదురుతాయి? అన్నది వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే అట్లీని ఏజీఎస్ సినిమాస్ సంస్థ ఏడాది పాటు లాక్ చేసినట్టే. ఒకవేళ దత్ తో అట్లీ ప్రాజెక్టు ఏడాది తర్వాత కానీ ఖాయం కాదన్నమాట.