కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు కొత్త సినిమాల విడుదలే లేదు. అసలు థియేటర్లను ఓపెన్ చేయలేదు. ఏడు నెలల తర్వాత ఈనెల 15న థియేటర్ల ఓపెన్ కు కేంద్రం కండీషన్స్ తో ఓకే చెప్పింది. ఆ కండీషన్స్ మద్య పెద్ద సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు విడుదలకు ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది ఇక పెద్ద సినిమాలు వస్తాయని ఎవరు కూడా భావించడం లేదు. తమిళ సూపర్ స్టార్ విజయ్ కొత్త సినిమా 'మాస్టర్' ఈ ఏడాది చివరి వరకు అయినా వస్తుందని నిన్న మొన్నటి వరకు ఆయన అభిమానులు ఎదురు చూశారు. కాని మాస్టర్ ఈ ఏడాదిలో విడుదల లేదని మేకర్స్ స్పష్టం చేశారు.
ఈ ఏడాదిలో విజయ్ సినిమా ఒక్కటి కూడా విడుదల అవ్వడం లేదు. ఆయన సినీ కెరీర్ లో ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఒకటి రెండు సినిమాలు విడుదల చేస్తూనే ఉన్నాడు. గత 27 ఏళ్లుగా విజయ్ ప్రతి సంవత్సరం కనీసం ఒక్క సినిమాను అయినా విడుదల చేస్తూ వచ్చాడు. ఇన్నాళ్ల కాలంలో ఏ ఒక్క సంవత్సరంను కూడా ఆయన జీరో ఇయర్ గా వదిలి పెట్టలేదు. ఈమద్య కాలంలో ఏడాదికి ఖచ్చితంగా రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ వచ్చాడు. అలాంటి విజయ్ ఈ ఏడాది మాత్రం ఒక్కటి విడుదల చేయలేక పోయాడు.
27 ఏళ్లుగా సినిమాలు విడుదల చేస్తూ జైత్ర యాత్ర కొనసాగించిన విజయ్ ఈ ఏడాదిలో సినిమా విడుదల చేయలేక పోవడంపై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సినీ చరిత్రలో ఏ స్టార్ హీరోకు ఇలాంటి రికార్డు లేదంటూ చాలా గర్వంగా అభిమానులు చెబుతున్నారు. ఈ ఏడాదితో ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది.