మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ''ఉప్పెన''. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈ సినిమాను దగ్గరుండి పర్యవేక్షించాడని తెలుస్తోంది. ఇందులో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సేతుపతి ది ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన విజయ్ సేతుపతి లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
కాగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్ర అయినప్పటికీ రెగ్యులర్ గా కనిపించే విలన్ తరహా రోల్ కాదని తెలుస్తోంది. ఈ సినిమాకి విజయ్ క్యారక్టర్ హైలైట్ గా నిలవనుందట. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ - విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయని అంటున్నారు. తమిళ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న మక్కల్ సెల్వన్.. 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్స్ అందుకునే అవకాశం ఉంది. మరి విజయ్ ఆ పాత్రలో ఏ స్థాయిలో మెప్పించారో తెలియాయంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. థియేటర్స్ పూర్తి స్థాయిలో రీ ఓపెన్ అయ్యాక 'ఉప్పెన' రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.