కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలిరా రప్పాడాలి అన్నచందంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కెరీర్ సాగిపోతుంది. అతనికి భాషతో పనిలేదు. ఎక్కడైనా దున్నుకుంటూ వెళ్లిపోవడమే. ట్యాలెంట్ ఉంటే ఎక్కడైనా సత్తా చాటొచ్చు అంటూ నిరూపించిన మరో నటుడిగా ఖ్యాతికెక్కాడు. ఇండియాలో ఏ నటుడు లేనంత బిజీగా ఉన్నాడు. కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నా డేట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి.
సౌత్లో ఇప్పటికే సత్తా చాటేసాడు. ఇక బాలీవుడ్ లో పాగా వేయడమే ఆలస్యం. అక్కడా అవకాశాలకు కొదవేం లేదు. ఇప్పటికే షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న 'జవాన్' చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. ఆరంభమే షారుక్ ని ఢీ కొట్టడంతో బాలీవుడ్ కి సేతుపతి సత్తా ఏంటో అర్ధమైపోయింది. అలాగే కత్రినా కైఫ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న 'మేరీక్రిస్మస్' లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మరోవైపు షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న చిత్రంలోనూ మక్కల్ సెల్వన్ ఎంపికైనట్లు సమాచారం. ఇంకా 'గాంధీ టాకీస్' అనే మూవీ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇంకా రెండు సినిమా ఛాన్స్ లు రెడీగా ఉన్నాయి. వాటికి సేతుపతి సంతకం చేయడమే ఆలస్యమని తెలుస్తోంది. ఇలా ఒక్క సినిమా కూడా హిందీలో రిలీజ్ అవ్వకుండా సేతుపతి బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుంటోన్న వైనం చూసి బాలీవుడ్ షాక్ అవుతుంది.
ఏంటి ఇతగాడి స్పెషల్ అంటూ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్ విలన్ల శైలిని పరిశీలిస్తే అక్కడి నటులంతా చాలా స్లిమ్ గా ఉంటారు. హైట్..వెయిట్..కటౌట్ అంతా హీరోయిక్ లుక్ లోనే ఉంటారు. కానీ సేతుపతి అందుకు భిన్నం. విక్రమ్ లో అతని శరీర శైలి చూసి తొలుత అంతా షాక్ అయ్యారు.
కానీ అదే హెవీ వెయిట్....ముందుకు తన్నుకొచ్చిన పొట్ట....క్యారీ బ్యాగ్ లా కొలెస్ర్టాల్ ఉన్నా నటనతో వారెవ్వా అనిపించాడు. పాత్రలో అతని ట్రాన్సపర్మేషన్..ఛేంజోవర్ చూసి ప్రేక్షకులు ఖంగు తిన్నారు. మక్కల్ సెల్వన్ నా..మజాకానా! అనిపించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.