దర్శకుడు పూరి జగన్నాథ్ కింద పడిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా సాలిడ్ ప్రాజెక్టుతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. 100 కోట్లు పోగొట్టుకున్న చేదు అనుభవం ఆయనకు చాలా నేర్పింది. అందుకే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఆయనంటే చాలామందికి ఒక స్ఫూర్తిగా అనే చెప్పాలి. కానీ లైగర్ దెబ్బకు ఇప్పుడు పూరి జగన్నాథ్ పరిస్థితి ఏ విధంగా మారింది అనేది హాట్ టాపిక్ మారింది.
ఆర్థికంగా అయితే పూరికి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు కానీ అసలు ఈ రేంజ్ లో నష్టాలు రాకుండా ఉండే అవకాశం ఆయనకు ఇదివరకే వచ్చింది. టైగర్ సినిమాను చాలా అత్యాశతోనే భారీ స్థాయిలోనే విడుదల చేయాలనుకున్నారు. ఛార్మి నిర్మాత అనే పేరే గాని బిజినెస్ వ్యవహారాలు మొత్తం పూరి జగన్నాథ్ చేతుల్లోనే కొనసాగాయి. అందుకే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా పూరి జగన్నాథ్ ను టార్గెట్ చేశారు.
ఒక విధంగా పూరి మంచితనం వల్ల ఇప్పుడు లైగర్ సినిమాతో నష్టపోయిన వారికి ఎంతో కొంత వెనక్కి తిరిగి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. అయితే నిజానికి లైగర్ సినిమాను ఓటీటీలో విడుదల చేసుకునే ఆఫర్ అయితే అప్పట్లో గట్టిగానే వచ్చింది. శాటిలైట్ అలాగే ఓటిటి హక్కులు అన్నీ కలిపి ఒక ప్రముఖ సంస్థ దక్కించుకోవాలని అనుకుంది. వాళ్లు అన్ని భాషలకు కలిపి రెండు వందల కోట్ల వరకు ఆఫర్ చేశారు.
ఒకవేళ మాట్లాడుకుంటే ఆ నెంబర్ మరికొంత పెరిగేది. ఆ వార్తలపై విజయ్ దేవరకొండ కూడా అప్పట్లో ఒక ట్వీట్ వేశాడు. ఇది చాలా చిన్నది. థియేటర్ లో నేను ఇంకా తేగలను అని ట్వీట్ లో చెప్పాడు. అలాగే ఛార్మి సైతం ఒక ఇంటర్వ్యూలో ఓటీటీ ఆఫర్స్ పై చాలా గొప్పలు చెప్పింది.
నిజానికి ఓటీటీ ఆఫర్స్ అయితే అప్పట్లో చాలానే వచ్చాయి. ఎటు కాదనుకున్నా లైగర్ కు ఉన్న హడావుడికి అప్పుడు 150 కోట్లయినా వచ్చేవి. కానీ దాన్ని రిజెక్ట్ చేసి సినిమాను థియేటర్ లో విడుదల చేశారు. కరణ్ జోహార్ లాంటి అనుభవం ఉన్న నిర్మాత కూడా ఈ సినిమా రిజల్ట్ ను కనిపెట్టకపోవడం ఆశ్చర్యకరం. ఏదేమైనా లైగర్ టీమ్ అతికి పోయి బంగారం లాంటి అవకాశం మిస్ చేసుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.