2023 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తెలుగు స్ట్రెయిట్ మూవీస్ పోటా పోటీగా పోటీ పడుతున్నాయి. మెగా స్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో, నందమూరి బాలకృష్ణ 'వీర సింహారెడ్డి'తో సంక్రాంతి సమరానికి సై అంటే సై అంటూ కాలుదువ్వుతున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ జోరందుకుంది. లిరికల్ వీడియోలు, టీజర్ లతో ఇటు చిరు, అటు బాలయ్య సంక్రాంతి సందడి మొదలు పెట్టారు. బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేస్తూనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్రమోషన్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ జోరుగా మొదలు పెట్టేసింది.
చిరు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తూనే మరో పక్క బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' ప్రమోషన్స్ ని ఎక్కడా తగ్గకుండా నడిపిస్తోంది. సంక్రాంతి సినిమాల రేసులో స్ట్రెయిట్ మూవీస్ ముందు వరుసలో నిలుస్తున్నాయి. చిరు 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న విడుదలవుతుండగా, బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. వీటితో పాటు సంక్రాంతి రేసులో దళపతి విజయ్ నటిస్తున్న డబ్బింగ్ మూవీ 'వారీసు' కూడా పోటీ పడుతోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళంలో 'వారీసు'గా, తెలుగులో 'వారసుడు'గా రిలీజ్ అవుతోంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లిరికల్ వీడియోలతో సినిమాపై అంచనాల్ని పెంచేశారు. తొలి సారి తెలుగు దర్శకుడు, నిర్మాతతో విజయ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై విజయ్ అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నెట్టింట ఈ మూవీని ట్రెండ్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.
అయితే చిత్ర బృందం, విజయ్ ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో మరీ టైమ్ తీసుకుంటున్నారు. తమిళ అప్ డేట్ ఇచ్చాకే తెలుగు అప్ డేట్ ఇస్తూ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. పొంగల్ రేసులో ఇప్పటికే తెలుగు సినిమాలు జోరుగా ప్రచారం మొదలు పెడితే విజయ్ 'వారసుడు' ప్రమోషన్స్ మాత్రం ఎక్కడ వేపసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపించడం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఈ మూవీ ట్రైలర్ ని కూడా మేకర్స్ మరింత ఆలస్యంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. విజయ్ అభిమానులు అంతా 'వారీసు' ట్రైలర్ ని న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే టీమ్ మాత్రం వారిని షాక్ కు గురి చేస్తూ తాపీగా రిలీజ్ చేయాలనుకుంటోందట. ట్రైలర్ ని జనవరి 1న కాకుండా జనవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోందట. 'వారీసు' తమిళ, తెలుగు భాషల్లో జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.