నటి.. దర్శకురాలు.. నిర్మాత అయిన విజయ నిర్మల నిన్న మృతి చెందిన విషయం తెల్సిందే. హాస్పిటల్ లో మృతి చెందిన ఆమె మృతదేహంను ఉదయాన్నే ఇంటికి తీసుకు రావడం జరిగింది. నిన్నంతా కూడా సినీ మరియు రాజకీయ ప్రముఖులు పలువురు ఆమె మృతదేహానికి నివాళ్లు అర్పించారు. నేడు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్పినా కూడా కాస్త ఆలస్యంగా అంత్యక్రియలు జరిగాయి.
నేడు ఉదయం నానక్ రామ్ గూడాలోని ఆమె ఇంట్లో సందర్శణ కోసం ఉంచారు. అక్కడ నుండి ఫిల్మ్ ఛాంబర్ కు విజయ నిర్మల మృత దేహంను తీసుకు వచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ లో కొద్ది సమయం ఉంచి అక్కడ నుండి విజయకృష్ణ గార్డెన్ కు తరలించారు. దారి పొడవున ఆమె అభిమానులు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. విజయకృష్ణ గార్డెన్ లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు కుటుంబ సభ్యులు ఆప్తుల సమక్షంలో ఆమె దహన సంస్కారాలు జరిగాయి. ఆమె కొడుకు అయిన నరేష్ ఆమె చితికి నిప్పు అంటించారు. కన్నీరు మున్నీరు అయిన నరేష్ ను బంధువులు మరియు మిత్రులు ఓదార్చారు.