స్టార్‌ హీరో విడాకులు.. అతడి పోస్ట్‌ ఉద్దేశ్యం అదేనా?

Update: 2022-10-13 06:48 GMT
తమిళంలో స్టార్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇద్దరి మధ్య వివాదం వచ్చినప్పుడు మూడవ వ్యక్తి వద్దకు వెళ్లడం అనేది కచ్చితంగా మంచి నిర్ణయం కాదు. ఆ మూడవ వ్యక్తి వల్ల సమస్య మరింతగా పెరిగే అవకాశం లేక పోలేదు అన్నట్లుగా పోస్ట్‌ లో పేర్కొన్నాడు.

జీవిత భాగస్వాముల మధ్య వచ్చే విభేదాల గురించి ఆయన మాట్లాడుతున్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భార్య భర్తల మధ్య గొడవలు జరిగిన సమయంలో తప్పకుండా సొంతంగానే పరిష్కరించుకోవాలి కానీ మరో వ్యక్తి వద్దకు వెళ్లిన సమయంలో ఆ సమస్య మరింత పెద్దగా మారే ప్రమాదం ఉంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.

ఆయన పోస్ట్‌ ఉద్దేశ్యం ను బట్టి చూస్తే ప్రస్తుతం ఆయన వైవాహిక జీవితం సమస్యల్లో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆయన ఫాలోవర్స్ సోషల్‌ మీడియా ద్వారా ఇదే విషయాన్ని గురించి చర్చించడం జరుగుతోంది. ఆయన వాదనను చాలా మంది సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

విజయ్ ఆంటోనీ దంపతులు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఆయన భార్య సినిమాల నిర్మాణంలో ఇతర విషయాల్లో భాగస్వామ్యం అయ్యేవారు. ఇద్దరి మధ్య ఇప్పుడు గతంలో ఉన్నట్లుగా పరిస్థితి లేదేమో అనిపిస్తుందని తమిళ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఇద్దరు త్వరలోనే విడాకులు తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది.

బిచ్చగాడు సినిమాతో తెలుగు లో మంచి పాపులారిటీని దక్కించుకున్న ఈ తమిళ హీరో ఆ తర్వాత పలు సినిమాలతో వచ్చినా కూడా సక్సెస్ అవ్వలేక పోయాడు. మళ్లీ బిచ్చగాడు సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సీక్వెల్‌ ప్లాన్‌ చేశాడు.

మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.. అలాగే ఆయన వ్యక్తిగత జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో కూడా చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News