మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించేందుకు యూనిట్ రెడీ అయిపోతోంది. ఇంకా ఈ మూవీ గురించి ఫైనల్ కావాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే.. హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారనే. ఇంకా ఈ సంగతిపై క్లారిటీ రాలేదు కానీ.. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మాజీ హీరోయిన్ కం పొలిటీషియన్ అయిన విజయశాంతిని చిరు 150 కోసం అడిగారని తెలియడం ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.
'ఈ మూవీలో ఓ స్పెషల్ కేరక్టర్ ఉంది. చిరంజీవితో పాటు దర్శకుడు వివి వినాయక్ కూడా ఈ రోల్ కి విజయశాంతి అయితే పర్ఫెక్ట్ సూట్ అవుతారని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమెతో సంప్రదించి చెప్పారు కూడా. విజయశాంతి ఈ అంశంపై పాజిటివ్ గానే రియాక్ట్ అయినా ఇంకా సైన్ చేయలేదు' అని సినిమా యూనిట్ నుంచి లీకులు అందుతున్నాయి. గతంలో చిరు - విజయశాంతి అంటే సూపర్ డూపర్ హిట్ పెయిర్.. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు అన్నీ హిట్స్ గానే నిలిచాయి.
గ్యాంగ్ లీడర్ షూటింగ్ టైమ్ లో కొన్ని తేడాలు రావడంతో కలిసి చేసేందుకు చిరు - విజయశాంతి అంగీకరించలేదని అంటారు. అయితే.. ముందుగా ఉన్న అగ్రిమెంట్ కారణంగా మెకానిక్ అల్లుడులో మాత్రమే చిరుతో కలిసి నటించారామె. ఆ తర్వాత విజయశాంతి కెరీర్ కొనసాగించినా.. అప్పటికే లేడీ అమితాబ్ ఇమేజ్ సంపాదించుకుని.. ఫిమేల్ లీడ్ ఉండే సినిమాలే చేశారు. ఒక వేళ చిరు 150లో చేసేందుకు విజయశాంతి అంగీకరిస్తే 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఆమె స్క్రీన్ పై కనిపిస్తారు.