మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు రాజకీయ నేతలు, టాలీవుడ్ పెద్దలు, సీనియర్, జూనియర్ హీరోలు స్పందిస్తున్నారు.ఇప్పటికే పలువురు పెద్దలు నేరుగా అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సీనియర్ నటి, బీజేపీ నేత విజయశాంతి కూడా సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించారు. సాయితో తనకున్న అనుబంధాన్ని ఆమె ట్విట్టర్ లో పంచుకున్నారు.
సాయిధరమ్ తేజ్ ప్రవర్తనపై విజయశాంతి ప్రశంసలు కురిపించారు. సాయి త్వరగా కోలుకోవాలని విజయశాంతి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోస్ట్ పెట్టారు.
'చక్కటి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవభావం కలిగిన మంచి వ్యక్తి. మరియు ఆర్టిస్ట్. సత్వరమే కోలుకోవాలని.. విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ' అని విజయశాంతి ట్వీట్ చేశారు.