విజయవాడలో ఆ బట్టలేంది పిల్లా??

Update: 2017-11-25 05:41 GMT
ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లయింది.. అల్లరి నరేష్ సినిమా నుంచి అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాల వరకు హీరోయిన్ గా నటించింది. చేసిన సినిమాల సంఖ్య పెరిగింది కానీ ఇమేజ్ మాత్రం ఇంచి కూడా పెరగలేదు హీరోయిన్ శ్రద్ధా దాస్ కు . ఎప్పటికప్పుడు గుర్తుండిపోయే సినిమాల కోసం మొహం వాచేలా ఎదురుచూడటంతోనే సరిపోతోంది.

తాజాగా శ్రద్ధదాస్ రాజశేఖర్ హీరోగా నటించిన పి.ఎస్.వి.గరుడవేగ 126.18ఎం సినిమాలోనూ నటించింది. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు యూనిట్ మొత్తం బాగానే ప్రమోట్ చేసింది. ఈ ప్రమోషన్లలో పాల్గొన్న శ్రద్ధ సినిమాలో చాలా పెద్ద రోల్ చేసినట్టే కబుర్లు చెప్పింది. తీరా చూస్తే ఆ సినిమా హిట్టయింది కానీ ఎప్పటిలాగే శ్రద్ధ గురించి మాట్లాడేవారే లేకుండాపోయారు. కాకపోతే మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం వల్ల షాప్ ఓపెనింగులకు అటెండై రిబ్బన్ కట్ చేసే అవకాశాలు మాత్రం వస్తున్నాయి. తాజాగా విజయవాడ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు శ్రద్ధను ఇన్వైట్ చేశారు. అమ్మడిని పిలిచింది విజయవాడ కాకుండా విదేశాలకు పిలిచారని ఫీలయిపోయినట్టుంది. ఫొటో షూట్లకు అటెండయినట్లు మతులు పోగొట్టే డ్రస్సు వేసుకెళ్లింది. చూసినోళ్లంతా ఆ బట్టలేంటి అని నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.

శ్రద్ధ తెలుగుతోపాటు హిందీలోనూ అడపాదడపా సినిమాలు చేస్తుంటుంది. ఈమధ్య బాలీవుడ్ లో బాబామోషాయ్ కి బందూక్ బాజ్ అనే ఘాటు రొమాన్స్ తో సినిమా వచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖి హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధాదాస్ నటించినా ఇందులోనూ ఆమె రోల్ కు ఎలాంటి గుర్తింపు రాలేదు. శ్రద్ధకు టైం ఎఫ్పటికి కలిసొస్తుందో.. ఏమో?
Tags:    

Similar News