ఎవరైనా కొడుకును బూతులు తిడుతుంటే ఎంత కోపం వస్తుంది? ఆ తండ్రి నవ్వి ఊరుకుంటాడా? ఆ తండ్రి రక్తం మరగదూ? అవతలి వాళ్లను పట్టుకుని కడిగేయడూ?.. కానీ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు మాత్రం తన కొడుకును తిడుతుంటే అసలు కోపమే రాలేదట. పైగా ఆ బూతుల్ని భలే ఎంజాయ్ చేశాడట. ఇంతకీ రాజమౌళిని తిట్టిందెవరు? విజయేంద్ర ప్రసాద్ ఆ తిట్లను ఎందుకంతగా ఆస్వాదించారు? ఆయన మాటల్లోనే విందాం పదండి.
‘‘బాహుబలి సినిమా విడుదలైన నాటి నుంచి అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నాం. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. కానీ వాటన్నింట్లోకి భిన్నమైన కాంప్లిమెంట్ గురించి చెబుతాను. గోదావరి పుష్కరాల సందర్భంగా నాకు ఎదురైన ఓ కొత్త అనుభవం గురించి చెబుతాను. మాది కొవ్వూరు. రేవుకెళ్లి స్నానం చేసి పుష్కర స్నానం చేసి పైకి వస్తుండగా పది మంది జనం గుమిగూడి ఉన్నారు. అందరూ గోదావరి జిల్లాల వారే. దేవుడు, పుష్కరాల గురించి మాట్లాడకుండా బాహుబలి గురించి చర్చించుకుంటున్నారు. అన్ పార్లమెంటరీ లాగ్వేజ్ అది. వాళ్ల మాటల్ని యథాతథంగా చెప్పలేను. వాళ్లలో ఒకడు.. ‘అసలు ఏమనుకుంటున్నాడు. ఆ రాజమౌళి ఏమనుకుంటున్నాడు.. సగంలో వదిలేస్తాడేంటీ.. ఇందుకోసం ఏడాదిన్నర ఆగాలా.. అసలు వాణ్ని..’’ అంటూ బూతులు తిడుతున్నాడు. ఆ బూతులు వింటటుంటే కోపం రాకపోగా ఆనందం కలిగింది. నవ్వొచ్చింది. వాళ్ల కోపం వెనకాల ఆలోచిస్తే బాహుబలి కథ వాళ్లకెంత నచ్చేసింది.. ఎంత ఇన్వాల్వ్ అయిపోయారో అనిపించింది. సెకండ్ పార్ట్ కోసం ఎంత తహతహలాడుతున్నారో చూసి ఆనందంతో పాటు రెండో భాగానికి సంబంధించి ప్రేక్షకుల అంచనాలకు రీచ్ కావాలనే భయం నాలో మొదలైంది’’ అని వివరించారు విజయేంద్ర ప్రసాద్.