​బాహుబలి అక్కడ ఓడిపోతాడు

Update: 2017-07-30 05:18 GMT
దంగల్ సినిమా చైనా దేశంలో విడుదలై మరే ఇండియన్ సినిమా అందుకోలేని కలెక్షన్లు సంపాదించింది. బాహుబలి2 కూడా తొందరలో చైనా లో కూడా విడుదల కాబోతుంది. ఇప్పుడు తెలుగు అభిమానులు మళ్ళీ వాళ్ళ బాహుబలి అభిమానం చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చైనా లో బాహుబలి 2 కచ్చితంగా కలెక్షన్లు ప్రభంజనం చేస్తుంది అని ధీమా గా చెబుతున్నారు. అయితే ఇదే మాట బాహుబలి సృష్టికర్త విజయేంద్ర ప్రసాద్ ను అడిగితే ఆయన ఆన్సర్ మరోలా ఉంది.

“బాహుబలి 2 చైనాలో విడుదలైనా దంగల్ సినిమా తెచ్చిన అన్ని కలెక్షన్లు సంపాదించుకోలేదు. ఎందుకంటే చైనా సినిమా అభిమానులు బాహుబలి లాంటి కొన్ని జానపద సినిమాలు ఆల్రెడీ చూసి ఉన్నారు. అటువంటి రాజుల డ్రామా - యుద్దాలు వాళ్ళకి కొత్త కాదు. కానీ దంగల్ సినిమా అలా కాదు ఒక కూతురు తన తండ్రి ఆశయాన్ని ఎలా సాధించింది అనేది కథ. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం.. లక్ష్య సాధన కోసం వాళ్ళ పోరాటం.. అద్భుతంగా చూపించారు. కాబట్టి బాహుబలి 2 సినిమా దంగల్ కలెక్షన్లు దాటి రికార్డులు క్రియేట్ చేస్తుంది అని నేను అనుకోవటంలేదు'' అని చెప్పారు. బాహుబలి మొదటి భాగం మన దేశంలో ఘన విజయం పొందిన తరువాత చైనా లో విడుదలైన అక్కడ అనుకున్నంతగా ఆడలేదు. ఆ విశ్లేషణ తోనే విజయేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు బాహుబలి 2 పై ఇటువంటి అభిప్రాయం తో ఉన్నారు అని అర్ధం చేసుకోవచ్చు.

బాహుబలి ఆది గురువే ఇలా అన్నందుకు బాహుబలి అభిమానులు కొంచం భాద పడిన ఈ మాట నిజానికి దగ్గరగా ఉండటంతో ఒప్పుకోక తప్పదు. ఏదైనా ఏది గెలిచింది ఏది ఓడిపోయింది అనేది కాదు ఇక్కడ మనం చూడవలిసింది రెండు ఇండియన్ సినిమాలు అసామాన్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నందుకు మనం అంత పండుగ చేసుకోవాలి. అదే బాహుబలి రైటర్ కూడా చెబుతున్నారు.


Tags:    

Similar News