తమిళ బాక్సాఫీస్ వద్ద వరస బ్లాక్ బస్టర్ల తో సంచలనం సృష్టిస్తున్నాడు ఇలయదళపతి విజయ్. 2019లో రిలీజైన బిగిల్ అతడికి సంతృప్తికరమైన విజయాన్ని ఇచ్చింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎజిఎస్ ఎంటర్ టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. దీపావళి కానుకగా విడుదలై 2019 లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా బిగిల్ 300 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం ప్రకటించింది. కార్తీ- లోకేష్ కనగరాజ్ కాంబో బ్లాక్ బస్టర్ చిత్రం `ఖైథీ` (ఖైదీ-తెలుగు)తో పోటీపడుతూ బిగిల్ తమిళనాట అంత పెద్ద విజయం సాధించింది.
ఈ సక్సెస్ ఊపులోనే అతడు ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి దళపతి 64 ప్రణాళికల్ని రివీల్ చేశాడు. ఇప్పటికే సన్ టీవీ ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ని ప్రకటించారు. మాస్టర్ అనేది టైటిల్. న్యూఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదలై సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తోంది. ఇంతకు ముందు `దళపతి 64` అనే వర్కింగ్ టైటిల్ కాగా.. `మాస్టర్` టైటిల్ వైరల్ గా దూసుకెళుతోంది. ఈ పోస్టర్ లో విజయ్ ముదురు నీలం రంగు చొక్కా ధరించి.. టేబుల్ పై చేతి కడియాన్ని తిప్పుతున్న లుక్ చూస్తుంటే అతడు ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా? అనిపించక మానదు. ఈ చిత్రం 2020 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.
ఇందులో విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. మాలవికా మోహనన్- ఆండ్రియా- అర్జున్ దాస్ - శాంతను భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.