విక్రమ్ కె కుమార్.. ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉన్న క్రేజీ డైరెక్టర్. మనం చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ అయ్యాడు కానీ.. అంతకు ముందే తన ట్యాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. ఏడేళ్ల క్రితం 13బీ అంటూ వచ్చిన మూవీ.. తెలుగు, తమిళ జనాలను బాగానే భయపెట్టింది. థ్రిల్లర్ లో కొత్త జోనర్ ని ఇంట్రడ్యూస్ చేసింది. రెండు భాషల్లోనూ మంచి సక్సెస్ అయిన ఈ మూవీకి., సీక్వెల్స్ చేయాలనే ఆలోచన ఉందిట విక్రమ్ కి.
మాధవన్ - నీతుచంద్రలతో 13బీ తీసి హిట్ కొట్టినపుడే.. ఈ మూవీని ఓ ట్రయాలజీ రేంజ్ లో తీయాలని విక్రమ్ భావించాడట. అందుకు తగ్గట్లుగానే 13సీ - 13డీ అంటూ స్క్రిప్టులు కూడా రాసి పెట్టుకున్నాడట విక్రమ్. అయితే.. ఓ భయంతో ఈ ప్రాజెక్టులను కాదని అనుకున్నాడట ఈ దర్శకుడు. వరుసగా థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్ లో భయపెట్టే సినిమాలు చేస్తే.. ఇక తనను ఆ కేటగిరీకే పరిమితం చేసేస్తారని భావించడంతోనే ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించలేదని చెప్పాడు విక్రమ్.
ఇప్పుడు మనం, 24 చిత్రాలతో తను విభిన్నమైన చిత్రాలను తీయగలనని నిరూపించుకోవడంతో. ఇప్పుడు 13 సిరీస్ ను బయటకు తీస్తానంటున్నాడు. త్వరలో 13 సీ - 13 డీ ప్రాజెక్టుల పనులు మొదలవుతాయని చెప్పాడు కూడా. మొత్తానికి ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తన ట్యాలెంట్ తో భయపెట్టడానికి రెడీ అయిపోతున్నాడు.