పొరుగింటి పుల్లకూర తియ్యన అంటారు. ఈ సామెత సినీ పరిశ్రమకు బాగా వర్తిస్తుంది. మన దగ్గర ఎంతమంచి నటులున్నా సరే.. మన దర్శకులకు పెద్దగా ఆనరు. వేరే ఇండస్ట్రీల్లో పెద్దగా పేరు లేని వాళ్లను తెచ్చి ఇక్కడ సింహాసనం వేసి కూర్చోబెట్టడం చూస్తుంటాం. వాళ్లకు అవకాశాలివ్వడం గురించి అభ్యంతరాల్లేవు కానీ.. మనోళ్ల టాలెంట్ గుర్తించకపోవడమే విడ్డూరం. ఓ తమిళ దర్శకుడు వచ్చి మన తెలుగు నటుడికి మంచి మంచి అవకాశాలిచ్చి.. అతడి గొప్పదనం గురించి చెబితే కానీ.. మనకు ఆ నటుడి ప్రత్యేకత అర్థం కాకపోవడం విచిత్రం. ఆ నటుడు అజయ్ అయితే.. ఆ దర్శకుడు విక్రమ్.కె.కుమార్.
రాజమౌళి ‘విక్రమార్కుడు’ సినిమాలో అజయ్ లోని మరో కోణాన్ని జనాలకు పరిచయం చేసి అతడికి మంచి పేరు తీసుకొచ్చినా.. అజయ్ టాలెంటుని మిగతా దర్శకులు పెద్దగా వాడుకుంది లేదు. ఐతే ‘ఇష్క్’ సినిమాలో విక్రమ్.. అజయ్ ను జనాలకు సరికొత్తగా పరిచయం చేశాడు. తాజాగా ‘24’ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో సైతం అజయ్ కు మంచి రోల్ ఇచ్చాడు. మామూలుగా చాలా తక్కువ మాట్లాడే విక్రమ్.. ఎప్పుడు అజయ్ ప్రస్తావన వచ్చినా గొప్పగా చెబుతాడు.
నిన్న ‘24’ సక్సెస్ మీట్లో సైతం సూర్య గురించి ఎంత బాగా మాట్లాడాడో.. అజయ్ గురించి కూడా అంత గొప్పగా చెప్పాడు విక్రమ్. ‘‘తెలుగులో ఉన్న మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్లలో అజయ్ ఒకడు. అతను ఎలాంటి పాత్రనైనా పోషించగలడు. మరిన్ని అవకాశాల్ని తన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు’’ అని కితాబిచ్చాడు విక్రమ్. మరి విక్రమ్ లాగే అజయ్ టాలెంటుని మన దర్శకులు కూడా వాడుకుంటారేమో చూడాలి.