'నాపేరు సూర్య' సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే సినిమాకు రంగం సిద్ధమవుతోంది. కన్ఫ్యూషన్ అంతా తొలగిపోయి ఇప్పుడు ఫైనల్ గా విక్రమ్ కుమార్ దగ్గరే వచ్చి ఆగింది. త్వరలో బన్నీ - విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన రానుందట. అంతలో ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి కదా. ఈ సినిమాకు రూ. 45 కోట్ల రూపాయలు కావాలని విక్రమ్ అడిగాడని, అందుకు అల్లు అరవింద్ ఓకె చెప్పారని టాక్. ఇది రెమ్యునరేషన్స్ కాకుండా సినిమా ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే. ఇక రెమ్యునరేషన్స్ అన్నీ కలుపుకుంటే భారీ బడ్జెట్ అవుతుంది అనుకోండి. అది వేరే విషయం. కానీ కొంతమంది ఈ 45 కోట్లు విక్రమ్ రెమ్యునరషన్ అని - సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని అంటున్నారు.. కానీ అదేమాత్రం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్ లో ఉండదు. ఒక్క రాజమౌళి తప్ప ఆ రేంజ్ లో రేమ్యునరేషన్న్ ఎవ్వరికీ ఇచ్చే అవకాశం లేదు కాబాట్టి అవి జస్ట్ స్పెక్యులేషన్స్ మాత్రమే అని మనం ఫిక్స్ అయిపోవచ్చు.
ఇక ఈ సినిమా విక్రమ్ కుమార్ స్టైల్ లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందని, కాకపొతే అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గట్టు అన్ని అంశాలు కూడా ఉండేలా కొంత మార్పు చేయడం జరిగిందని టాక్ వినిపిస్తోంది. బన్నీ - విక్రమ్ ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు కాబట్టి ఈ సినిమా విజయం ఇద్దరికీ కీలకం కానుంది.