24 ట్రిమ్మింగ్.. అతడికి నచ్చలేదా?

Update: 2016-05-15 11:30 GMT
‘24’ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఐతే సినిమాలో నెగెటివ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి ఒక్కరూ రొమాంటిక్ ట్రాక్ కు సంబంధించిన సన్నివేశాల గురించే మాట్లాడారు. ఈ విషయంలో అందరిదీ ఏకాభిప్రాయం కావడంతో సూర్య అప్రమత్తం అయిపోయాడు. రెండో రోజుకే 10 నిమిషాల దాకా ట్రిమ్ చేయించేశాడు. ఐతే ఈ ట్రిమ్మింగ్ దర్శకుడు విక్రమ్ కుమార్ కు నచ్చలేదని సమాచారం.

ఎంతైనా తాను ఎంతో ఇష్టంగా తీసిన సన్నివేశాలు కదా. అందుకేనేమో ఈ కోత అతడికి నచ్చలేదట. ట్రిమ్మింగ్ గురించి మాట్లాడ్డానికి ‘24’ సహ నిర్మాత.. సూర్య కజిన్ జ్నానవేల్ రాజా ఫోన్ చేస్తే అసలు విక్రమ్ ఫోనే తీయలేదట. సినిమాను పది నిమిషాలు ట్రిమ్ చేద్దాం అన్న నిర్ణయం తీసుకుని విక్రమ్ కు సమాచారం ఇచ్చాక మళ్లీ ఎడిటింగ్ కోసం పిలవడానికి అతడికి ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ కాలేదట విక్రమ్. దీంతో జ్నానవేల్ నేరుగా విక్రమ్ ఇంటికే వెళ్లాడట.

‘‘ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’’ అంటూ ఖరాఖండిగా చెప్పేసిన విక్రమ్ ఆ ట్రిమ్మింగ్ ప్రాసెస్ లో ఏమాత్రం జోక్యం చేసుకోలేదట. దీంతో జ్నానవేల్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్లు.. ఎడిటర్ తో కలిసి ఆ ఎడిటింగ్ పనేదో ముగించాడట. విక్రమ్ వ్యవహార శైలిని కొందరు విమర్శిస్తుండగా.. ఓ దర్శకుడు తాను ఎంతో ఇష్టంగా తీసిన సన్నివేశాల్ని తొలగించడానికి ఇష్టపడకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని ఇంకొందరు అంటున్నారు.
Tags:    

Similar News