అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలైన వెంటనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల్సి ఉంది. కాని నా పేరు సూర్య చిత్రం ఫలితం తారు మారు అవ్వడంతో వెంటనే సినిమా చేయడం, అది కూడా ప్రయోగాత్మక చిత్రం చేయడం ఏమాత్రం శ్రేయష్కరం కాదని భావించిన బన్నీ కాస్త గ్యాప్ తీసుకోవాలనుకున్నాడు. అదే సమయంలో విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు సూచించాడు. విక్రమ్ తీసుకు వచ్చిన మెయిన్ స్టోరీ లైన్ నచ్చిన బన్నీ స్క్రీన్ప్లే విషయంలో కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశాడని, దాన్ని మార్చి పలు వర్షన్ లను విక్రమ్ కుమార్ బన్నీకి వినిపించాడట. అయినా కూడా బన్నీని ఒప్పించలేక పోయాడట.
విక్రమ్ కుమార్ ఇంకా కూడా బన్నీకి నచ్చే విధంగా కథను మలిచే పనిలో ఉన్నాడట. ఇదే సమయంలో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అరవింద సమేత చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకున్న నేపథ్యంలో మరో ఆలోచన లేకుండా వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేయాలని బన్నీ నిర్ణయించుకున్నాడు. త్రివిక్రమ్ కు బన్నీ ఫిక్స్ అయినా కూడా విక్రమ్ మాత్రం మరో హీరోకు షిఫ్ట్ అవ్వాలని భావించడం లేదు.
త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేసిన తర్వాత తనతో సినిమా చేస్తాడనే నమ్మకంతో విక్రమ్ ఉన్నాడట. మరో హీరోను కలిసి కథను వినిపించి, ఆయన్ను ఒప్పించడం కంటే ఇప్పటికే కథకు ఓకే చెప్పిన బన్నీతోనే సినిమాను కానివ్వాలని విక్రమ్ నిర్ణయించుకున్నాడట. అల్లు అర్జున్ కోసం ఇంకా కొన్నాళ్ల పాటు విక్రమ్ కుమార్ వెయిట్ చేయబోతున్నాడు. విక్రమ్ కు బన్నీ నో చెప్పకుండా స్క్రిప్ట్ విషయమై అప్పుడప్పుడు చర్చిస్తూనే ఉన్నాడట. దాంతో విక్రమ్ ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా బన్నీ ఛాన్స్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నాడు. మరి త్రివిక్రమ్ తో మూవీ తర్వాత అయినా విక్రమ్ కు బన్నీ ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.