హాట్ టాపిక్: డైరెక్టర్- ప్రొడ్యూసర్ అడ్వాన్సు లొల్లి

Update: 2018-11-24 10:31 GMT
ఎవరైనా డైరెక్టర్లు పెద్ద హిట్ సాధించినప్పుడు వారికి సీనియర్ నిర్మాతలు అడ్వాన్సు ఇవ్వడం.. తమ బ్యానర్లో సినిమా చేసేందుకు డీల్ కుదుర్చుకోవడం చాలా సాధారణమైన విషయం.  కొందరు డైరెక్టర్లు అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలందరికీ సినిమాలు చేసిపెట్టడం కుదరనప్పుడు వారికి అడ్వాన్సు వడ్డీతో సహా తిరిగివ్వాల్సి ఉంటుంది. రీసెంట్ గా ఇలాంటి ఇష్యూ సీనియర్ నిర్మాత అశ్విని దత్ - డైరెక్టర్ విక్రమ్ కుమార్ మధ్య వచ్చిందని ఫిలిం నగర్లో రూమర్లు హల్చల్ చేస్తున్నాయి.

'మనం' సూపర్ హిట్ అయిన తరవాత దత్తుగారు విక్రమ్ కు భారీ మొత్తంలో అడ్వాన్సు ముట్టజెప్పారట.  కానీ ఇప్పటికీ వైజయంతీ బ్యానర్ లో సినిమా చేయడం విక్రమ్ కుమార్ కు వీలు కాలేదు.  విక్రమ్ దర్శకత్వంలో నాని హీరోగా ఒక సినిమాను తెరకెక్కించాలనేది దత్తుగారి ఆలోచనట.  ఎంతకీ ఆ ప్రాజెక్ట్ సాకారం కాకపోవడం.. పైగా విక్రమ్ వేరే సినిమాలకోసం ప్రయత్నిస్తూ ఉండడంతో దత్తుగారు అడ్వాన్సు అమౌంటును తిరిగివ్వమని అడిగారట.  విక్రమ్ ఇప్పుడు ఇవ్వలేనని చెప్పడంతో ఈ పంచాయితీ టాలీవుడ్ పెద్దల దగ్గరకు చేరిందట.

ఇలాంటి ఇష్యూలు వచ్చినపుడు సహజంగా పాటించే  పద్దతిలోనే తీర్పు చెప్పారట.  దాని ప్రకారం విక్రమ్ ఎవరితో నెక్స్ట్ సినిమా చేస్తారో.. ఆ సినిమా నిర్మాత దత్తుగారి అడ్వాన్సు అమౌంటును తీర్చాల్సి ఉంటుందట. అంటే అయన విక్రమ్ రెమ్యునరేషన్ లో మినహాయించుకుంటాడు లెండి.  అంతా బాగానే ఉంది కానీ ఇప్పటివరకూ విక్రమ్ నెక్స్ట్ సినిమా అసలు ఫిక్స్ కాలేదే. నాని సినిమా కుదరలేదు.. బన్నీ సినిమా సైడ్ అయిపోయింది. మరి ఆ సినిమా ఎప్పుడు కుదురుతుందో.. ఎప్పుడు దత్తుగారి అడ్వాన్సు వెనక్కి వస్తుందో..!
    

Tags:    

Similar News