సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. 'ఇష్టం' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన విక్రమ్ కుమార్ '13 బి' 'ఇష్క్' 'మనం' '24' 'హలో' 'నాని గ్యాంగ్ లీడర్' వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే 'గ్యాంగ్ లీడర్' తర్వాత ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ క్రేజీ డైరెక్టర్. అయితే అల్లు అర్జున్ తో విక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉండగా అది ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో విక్రమ్ కుమార్ నెక్స్ట్ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉండబోతోందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు విక్రమ్ సన్నాహాలు చేసున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థ ఈ సినిమా తెరకెక్కించనుందని టాలీవుడ్ టాక్. 'మనం' సినిమాతో అక్కినేని కుటుంబానికి చిరస్థాయిగా నిలిచిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందించిన విక్రమ్ కుమార్ తో మరో సినిమా చేసేందుకు నాగ చైతన్య కూడా ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పుకున్నారు.
అయితే ఇప్పుడు లేటెస్టుగా విక్రమ్ కుమార్ హారర్ జోనర్ లో ఓ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. 2009లో '13 బి' వంటి హారర్ సినిమా తెరకెక్కించిన విక్రమ్ మళ్ళీ ఈ జోనర్ లో సినిమా తీయలేదు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ప్రొడక్షన్ లో వర్క్ చేయబోతున్నాడని న్యూస్ స్ప్రెడ్ అయింది. ప్రస్తుతం చైతూ కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న విక్రమ్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే లోపు వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. 'లవ్ స్టోరీ' తర్వాత చైతూకి మరో రెండు కమిట్మెంట్స్ ఉండటంతో శరత్ మరార్ కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట విక్రమ్. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.