కొంతమంది రొటీన్ క్యారెక్టర్లతో విసుగెత్తించేస్తుంటారు. వాళ్లను రొటీన్ పాత్రల్లో చూడటం బోర్ కొట్టేస్తుంటుంది. అలాగే ఎప్పుడూ విభిన్నమైన పాత్రలతోనే బోర్ కొట్టించేసే నటులు కూడా కొందరుంటారు. సౌత్ ఇండియాలో అలాంటోళ్లలో విక్రమ్ పేరు కచ్చితంగా చెప్పుకోవాలి. విక్రమ్ రొటీన్ పాత్రలో నటించడమే వైవిధ్యం అనుకునే పరిస్థితి వచ్చింది. రెండు దశాబ్దాల కెరీర్ లో ఆ స్థాయిలో ప్రయోగాలు చేశాడు విక్రమ్.
తాజాగా మరో పెద్ద ప్రయోగానికి రెడీ అవుతున్నాడు విక్రమ్. అతను హీరోగా తమిళంలో ప్రస్తుతం ‘మర్మ మణిదన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రెండు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు విక్రమ్. ఒకటి హీరో పాత్ర కాగా.. ఇంకోటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. పైగా ఆ నెగెటివ్ క్యారెక్టర్ హిజ్రా అంటున్నారు.
తెలుగులోకి డైనమైట్ గా రీమేక్ అయిన అరిమా నంబి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. విక్రమ్ ఇంతకుముందు మల్లన్న సినిమాలో అమ్మాయి వేషంలో కాసేపు సందడి చేశాడు. ఇప్పుడు ఏకంగా పూర్తిస్థాయి హిజ్రా పాత్రకే రెడీ అయిపోయాడు. మరి ఈ పాత్రలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.