ఫోకస్: కథలన్నీ విలేజీలకు వచ్చేస్తున్నాయ్‌

Update: 2015-08-13 23:26 GMT
టాలీవుడ్‌, బాలీవుడ్‌ కాదేదీ విదేశీయతకు అనర్హం. ఫారిన్‌ కల్చర్‌ ని అడాప్ట్‌ చేసుకుని సినిమాలు తీస్తున్నారంతా. అయితే ఇప్పుడిప్పుడే విదేశాల్లో ఉన్నా మన పల్లె పట్టు పరిశ్రమే గొప్పదని వెండితెరపైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మోడ్రన్‌ అయిపోయినా ఇంకా పల్లెటూళ్లు అక్కడి అందాలు అంతమైపోలేదని కల్చర్‌ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

నిన్నగాక మొన్న రిలీజైన శ్రీమంతుడులో మహేష్‌ బిలియనీర్‌ అయినా తలబిరుసు నెత్తికి ఎక్కించుకోని వాడిగా నటించాడు. మన పల్లెటూళ్లను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్న తపనను కనబరిచాడు. అందుకోసం పల్లెటూరి నేపథ్యం ఎంచుకున్నారు. అంతకంటే ముందే సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో బన్ని వందల కోట్ల ఆస్తిపరుడే అయినా వాటన్నిటినీ వదులుకుని మనదైన పద్ధతికి, విలువలకి కట్టుబడ్డాడు. అందుకే ఈ రెండు సినిమాలు బ్టాక్‌ బస్టర్‌ హిట్స్‌ గా నిలిచాయి. ఈ సినిమాల్లో చిన్న పట్టణాలు కనిపించాయి. పల్లెటూరి కల్చర్‌, సామాన్యుడి పాయింట్‌ ఆఫ్‌ వ్యూ కనిపించింది.

వాస్తవానికి ఎన్నారై కథలతో సినిమాలు తీయడం అనేది బాలీవుడ్‌ కల్చర్‌. ఉత్తరాది జనం ఎక్కువగా విదేశాలు చుట్టొస్తుంటారు. కల్చర్‌ పరంగా మనకంటే అడ్వాన్స్‌ డ్‌ కాబట్టి వారికి అమెరికా, న్యూయార్క్‌ కొట్టిన పిండి. అందుకే ఇన్నాళ్లు అలాంటి కథలతోనే సినిమాలు తీశారక్కడ. ముంబై నుంచి విదేశం వెళ్లిపోయే కథలతోనే సినిమాలు తీశారు. అయితే రొటీనిటీ ప్రేక్షకులకు విసుగు తెచ్చింది. అందుకే వాళ్ల మైండ్‌ సెట్‌ మారింది. ఇటీవలే రిలీజైన మాసాన్‌ చిత్రంలో పవిత్ర వారణాసి ప్రజల జీవనవిధానాన్ని చూపించారు. మరోచిత్రం దమ్‌ లగా కే హైసా చిత్రంలో హరిద్వార్‌ లోని దంపతుల స్వచ్ఛమైన ప్రేమ కథని ఆవిష్కరించారు. పికూ చిత్రంలో స్వచ్ఛమైన బెంగాళీ అమ్మాయి జీవితాన్ని ఆవిష్కరించారు. తను వెడ్స్‌ మను చిత్రంలో హర్యాణా పరిసరాల్లోని పల్లె పట్టు సౌందర్యాన్ని చూపించారు. ఆలియాభట్‌ హైవై కథాంశం హైవే చుట్టూ ఉండే జిల్లాలన్నిటినీ కలుపుకుపోయింది. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, హిమచల్‌ ప్రదేశ్‌, కాశ్మీర్‌ పరిసరాల్లోని పచ్చందాన్ని చూపించింది.

ఇక ధనుష్‌ హీరోగా నటించిన రాంజానా చిత్రం అంత పెద్ద హిట్టవ్వడానికి మారిన పల్లె నేపథ్యమే కారణం. ఇలా సినిమాల్లో కంటెంట్‌ పల్లెలకు వెళ్లడం వల్ల భారతీయత ఎలా ఉంటుందో విదేశాల వాళ్లకు తెలుస్తోంది. దీనివల్ల విదేశీయుల టూరిజం స్పాట్‌ లు పెరుగుతున్నాయి. ఇది మంచి పరిణామమే.
Tags:    

Similar News