అన్న‌య్య‌కి చెప్పే చేస్తాన‌న్న వినాయ‌క్‌

Update: 2017-01-11 04:43 GMT
ఖైదీ నంబ‌ర్ 150తో నాకూ... వినాయ‌క్‌ కీ మ‌ధ్య అనుబంధం మ‌రింతగా పెరిగింద‌ని ఇటీవ‌ల జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ లో చిరంజీవి చెప్పిన విష‌యం తెలిసిందే. త‌న సోద‌రులు నాగ‌బాబు - ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ఎలాగో నాకు వినాయ‌క్ అలా అన్నారాయన.   ఆ మాట విని వినాయ‌క్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడు. మెగాస్టార్ నుంచి అంత‌టి ఆత్మీయ‌మైన గెశ్చ‌ర్ అంటే ఎవ్వ‌రైనా ఆనంద‌ప‌డ‌తారు. వినాయ‌క్ కూడా అన్న‌య్య అన్న‌య్య అంటూ చిరుపై అంతే ప్రేమ‌ని వ్య‌క్తం చేస్తున్నాడు. మా నాన్న త‌ర్వాత నా కెరీర్‌ ని దారిలో పెట్టారు - మీరు  నా పెద్ద‌న్న‌య్య  అని చిరంజీవినుద్దేశించి వినాయ‌క్ చెప్పిన విష‌యం కూడా  గుర్తుండే ఉంటుంది.  నిజంగానే ఖైదీ నంబ‌ర్ 150తో వినాయ‌క్ త‌న పెద్ద‌న్న‌య్య‌కి చిరులో చూసుకొన్న‌ట్టు క‌నిపిస్తోంది.

కేవ‌లం  మాట‌ల్లోనే కాదు...  ఇక‌పై ఏ సినిమా చేసినా అన్న‌య్య‌కి చెప్పే చేస్తాన‌ని వినాయ‌క్ మీడియాతోనూ వెల్ల‌డించ‌డం విశేషం. అంటే ఇక‌పై చేయబోయే  ప్ర‌తి సినిమా విష‌యంలోనూ చిరు స‌ల‌హాల్ని - సూచ‌న‌ల్ని వినాయ‌క్ పాటిస్తాడ‌న్న‌మాట‌.  నిజానికి చిరు 150వ సినిమా  చేయ‌డం కోసం ప‌లువురు ద‌ర్శ‌కులు పోటీప‌డ్డారు. అయితే చిరు మాత్రం ఏరికోరి వినాయ‌క్‌ కి ఆ బాధ్య‌త‌ని అప్ప‌జెప్పారు.  అదొక గొప్ప గౌర‌వంగా భావించారు వినాయ‌క్‌. ఆయ‌న‌కి ఇటీవ‌ల చెప్పుకోద‌గ్గ విజ‌యాలు కూడా లేక‌పోయినా... కేవ‌లం న‌మ్మ‌కంతో చిరు ఆయ‌న‌కి బాధ్య‌త‌లు చెప్పారు. వినాయ‌క్ కూడా అదే న‌మ్మ‌కంతో సినిమాని చేసి ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News