నాగ్‌.. వినయ్‌.. నితిన్‌.. ఏమన్నారంటే...

Update: 2015-09-20 17:45 GMT
''అఖిల్‌'' సినిమా ఆడియో వేదికలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.. ప్రయోజకుడు అయిన తన చిన్నకొడుకు గురించి తండ్రి నాగార్జున ఏం చెబుతారు.. అలాగే తొలిసారిగా ఒక స్టార్‌ హీరో అయ్యుండీ మరో హీరో కోసం సినిమాను ప్రొడ్యూస్‌ చేసిన నితిన్‌ ఏం చెబుతాడనే. పదండి వారేం చెప్పారో ఓ లుక్కేద్దాం.

''మన బంధం ఇప్పటిది కాదు.. 70 సంవత్సరాల క్రితం మొదలైంది.. అది అలాగే పెరుగుతూ ఇప్పుడు అఖిల్‌ ను ఒక సునామీ కెరటం మీద పైకెక్కిచ్చి తీసుకెళుతున్నారు. అభిమానులందరికీ థ్యాంక్స్‌'' అన్నారు కింగ్‌ నాగార్జున. ''నాన్నగారు నా గుండెల్లో, మీ కేకల్లో ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. అఖిల్‌ కు ఈ రేంజు ఆదరణ చూపించినందుకు.. నేను - అమల - చైతూ - అఖిల్‌.. మీకు నమస్కారం పెడుతున్నాం'' అంటూ షార్ట్‌ అండ్‌ స్వీట్‌ గా చెప్పారు కింగ్‌.

''అఖల్‌ సూపర్‌ స్టార్‌ అవుతాడని చూసినవాళ్లు అనుకున్నారు. కాని ఈ సినిమా తీసిన వాడిగా చెబుతున్నా.. అఖిల్‌ అతి పెద్ద సూపర్‌ స్టార్‌ అవుతాడు. నాగార్జున  గారు ఒక పెద్ద బాధ్యత నా మీద పెట్టారు. ఆ మాటను నిలబెట్టుకుంటాను సార్‌'' అంటూ సెలవు తీసుకున్నాడు వినయ్‌. తన టెక్నీషియన్ లకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు.

ఇక ఉద్వేగభరితమైన స్పీచ్‌ అంటే.. అఖిల్‌ తరువాత నిర్మాత నితిన్‌ ఇచ్చాడనే చెప్పాలి. ''ఈ సినిమాకు ఒక ప్రొడ్యూసర్‌ అనే పేరు తప్పే.. నేను చేసిందేం లేదు. మా నాన్న గారు.. మా అక్క పడిన కష్టమే ఇదంతా.. ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ హీరోను నాకిచ్చినందుకు.. నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టినందుకు గర్విస్తున్నా..'' అంటూ చాలా వినమ్రతతో చెప్పాడు నితిన్‌.  ''మీరందరూ నితిన్‌ జాక్‌ పాట్‌ కొట్టాడని అనుకోవచ్చు.. కాని నాకు మాత్రం ఫుల్‌ టెన్షనే.. నాగార్జున - అఖిల్‌ అమల గారికి ఎంత టెన్షన్‌ ఉందో తెలియదు కాని.. నాకు.. వినయ్‌ గారికి మాత్రం.. అంతా టెన్షనే..'' అని చెప్పాడు. ఇక నాగర్జున గారికి ఒక మాంచి బ్లాక్‌ బస్టర్‌ ఇస్తామని మాటిచ్చామని.. ఈ సినిమాను ఆల్రెడీ ఫస్టు కాపీ చూసినవాడిగా అది శపథం చేసి మరీ చెబుతున్నా అన్నాడు ఇష్క్‌ బాయ్‌. ''అమల గారు స్మూత్‌ గా సాఫ్టుగా మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నాం అన్నారు.. ఆ మాటలతో ఇంకా ప్రెజర్‌ పెరిగింది. అందుకే చాలా కష్టపడి పనిచేశాం'' అన్నాడు.

ఇక అఖిల్‌ గురించి చెబుతూ.. ''నేను మొదటి సినిమా చేస్తున్నప్పుడు నాకు ఇంత మెచ్యురిటి  లేదు. కాని అఖిల్‌ వేరు. తన కాన్ఫిడెన్స్‌.. తన మెచ్యురిటి.. హార్డ్‌ వర్క్‌.. డెడికేషన్‌.. తనని ఎక్కడికో తీసుకెళతాయి. యురోప్‌ షెడ్యూల్‌ లో ఫైట్‌ చేస్తున్నప్పుడు తన కాలికి దెబ్బతగిలినా కూడా.. ప్రొడక్షన్‌ ఖర్చు పెరగకుండా ఇంజక్షన్లు తీసుకొని మరీ పాటను కంప్లీట్‌ చేశాడు. ఈ రేంజులో కృషి చేస్తే మనోడు ఎక్కడికో వెళిపోతాడు'' అంటూ ముగించాడు నితిన్‌.

ఇకపోతే.. ''ఈ సంవత్సరం విజయ దశమికి.. అక్టోబర్‌ 22న అఖిల్‌ సినిమా విడుదల కాబోతోంది'' అంటూ అసలు విషయం ప్రకటించారు కింగ్‌ నాగార్జున.  ఆ విధంగా అఖిల్‌ తొలి సినిమా ఆడియో లాంచ్‌ ''అఖిల్‌'' ఆడియో లాంచ్‌ కార్యక్రమం పూర్తయ్యింది.

మరిన్ని లైవ్‌ అండ్‌ స్పయిసీ తాజా వార్తల కోసం తుపాకి.కాం తో కనక్ట్‌ అయ్యుండండీ!!
Tags:    

Similar News