150వ సినిమా గుట్టు చెప్ప‌లేదు

Update: 2015-11-06 08:12 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించే 150వ సినిమా ఎప్పుడు?  దీనికి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న లేనేలేదు. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో క‌త్తి రీమేక్ చిరు న‌టించే ల్యాండ్‌ మార్కు సినిమా అంటూ ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే అది కూడా క‌న్ఫ‌మ్ కాద‌ని తేలిపోయింది. అస‌లు మెగాస్టార్‌ తో సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అన్న ప్ర‌శ్న‌కు .. వినాయ‌క్ మాట దాట‌వేశారు.

అస్స‌లు ఉంటుందో లేదో కూడా చెప్ప‌లేదు. త‌ర్వాత చెబుతా.. ఇప్పుడు కాదు.. అని విష‌యాన్ని దాచేసే ప్ర‌య‌త్నం చేశారు. అంతేనా ..?  చిరును ఈ సినిమా గురించి ఎప్రోచ్ అయ్యారా?  లేదా? అని ప్ర‌శ్నించ‌గానే ... కాస్త షాకింగ్‌ గా చూస్తూ .. అన్న‌య్య‌ను క‌ల‌వాలంటే నేను ఎప్రోచ్ కాన‌వ‌స‌రం లేదు. మా మ‌ధ్య అలాంటిది ఉండ‌దు. క‌ల‌వాలి అనుకుంటే వెళ్లి క‌లిసి వ‌స్తాను. మామూలుగా మా మ‌ధ్య బాంధ‌వ్యం అలాంటిది అంటూ ప‌ర్టిక్యుల‌ర్‌ గా నొక్కి చెప్పాడు విన‌య్‌. ఇదంతా అఖిల్ సినిమా ప్ర‌మోష‌న్‌లో సాగిన ఇంట్రెస్టింగ్ డ్రామా!

చిరుని ఎప్రోచ్ అయ్యారా? అన్న‌ప్పుడు విన‌య్ ముఖంలో మారిన రంగులు ఇప్పుడు మీడియాలో డిస్క‌ష‌న్ పాయింట్ అయ్యాయి. వినాయ‌క్ వైఖ‌రిపై విస్ర్త‌తంగా చ‌ర్చ‌కొచ్చింది. అస‌లు 150వ సినిమా ఉందా?  లేదా? అన్న సందేహాలొచ్చాయి అంద‌రికీ. మ‌రోసారి చెబుతాను. వేరొక ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడుతాను.. అంటూ విన‌య్ ఆ సంగ‌తిని ప్ర‌స్థావించ‌క‌పోవ‌డం నిజంగానే ప‌లువురిని నిరాశ‌ప‌రిచింది. అస‌లే వినాయ‌క్‌ని చాలా గ్యాప్ త‌ర్వాత మీట‌వుతున్నాం. ఎట్టిప‌రిస్థితిలో 150వ సినిమా గురించి స‌మాచారం వ‌చ్చేస్తుంది.. అనుకున్న మీడియా మెగాభిమానుల‌కు ఇది నిజంగానే నిరాశ‌క‌లిగించింది.

ఏదేమైనా ప్ర‌స్తుతం మెగా సినిమా డౌట్‌ఫుల్ ఇంకా అని అంటున్నారు. వినాయ‌క్ ఇంకా స్ర్కిప్టు గురించే ప‌ట్టించుకున్న‌ట్టు క‌నిపించ‌లేదు. అఖిల్ సినిమాతో అల‌సిపోయాను. ముందు విశ్రాంతి కావాలి. త‌ర్వాతే ఏం మాట్లాడినా .. అంటూ అత‌డు అన్న మాట‌లు ఇప్ప‌టికీ చెవుల్లో రింగుమంటున్నాయి. అస‌లేం జ‌రుగుతోంది? వ‌చ్చే ప్రెస్‌ మీట్ వ‌ర‌కూ ఆగాల్సిందేనా? ప్చ్.. కాస్త క‌ష్ట‌మే!

Tags:    

Similar News