సీక్వెల్ అనే ఆలోచన మానుకుంటే మంచిది: డైరెక్టర్ వినాయక్

Update: 2021-06-17 02:30 GMT
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ అనేవి మాములే అయిపోయింది. ఇదివరకు సీక్వెల్స్ అంటే నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఓ సినిమా సక్సెస్ అయిందంటే చాలు. ఆ సినిమాకు సీక్వెల్ అని మేకర్స్ ప్రకటించకపోతే ఆడియన్స్ నుండి ఒత్తిడి.. లేదా ఆడియన్స్ డిమాండ్ మేరకు మేకర్స్ ముందుకు వెళ్లడం. కానీ మాక్సిమం ఇటీవలి కాలంలో ఆడియన్స్ డిమాండ్ చేసే అవసరం లేదు. ఎందుకంటే సినిమా హిట్ అయితే మేకర్స్ వెంటనే సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. ఆ విధంగా తెలుగులో కూడా హిట్ సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి.

తెలుగులో ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. అయితే కొద్దికాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సీక్వెల్స్ ఎప్పుడని.. లేదా ఓల్డ్ సూపర్ హిట్ సినిమాలకు రీమేక్స్ ఎప్పుడని అభిమానులు కోరుతూనే ఉంటారు. కానీ అందరూ అనుకున్నవి జరగవు కదా.. ఆ విధంగానే మేకర్స్ మెగాస్టార్ కూడా చర్చలు జరపాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి - మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సెన్సేషనల్ హిట్ 'ఠాగూర్' సినిమా సీక్వెల్ ఎప్పుడని ఫ్యాన్స్ నుండి డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. దానికి మెగాస్టార్ - డైరెక్టర్ కూడా ఇన్నిరోజులు క్లారిటీ ఇవ్వలేదు.

కానీ తాజాగా వివి వినాయక్ ఠాగూర్ సీక్వెల్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం వివి వినాయక్ మాట్లాడుతూ.. "ఠాగూర్ లాంటి అద్భుతాలు ఒక్కసారి మాత్రమే జరుగుతాయని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ చేయడం అనేది పెద్ద సవాలే. కానీ పరిస్థితులు అనుకూలిస్తే ఆ సందర్బం వస్తే మాత్రం నేను కూడా చేయడానికి సిద్ధంగానే ఉంటాను. కానీ ఒకవేళ సీక్వెల్ రిలీజ్ అయ్యాక ప్లాప్ అయితే మాత్రం పరిస్థితి ఏంటి? అప్పుడు మొదటి ఒరిజినల్ ఠాగూర్ ఇమేజ్ కూడా డామేజ్ అవుతుంది. అందుకే బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ అనేవి అవాయిడ్ చేస్తే మంచిది" అంటూ ఆయన అభిప్రాయం బయటపెట్టారు.

దీన్ని బట్టి ప్రస్తుతం వివి వినాయక్ ఠాగూర్ సీక్వెల్ చేయట్లేదని క్లియర్ గా అర్ధమవుతుంది. పరిస్థితి అనుకూలిస్తే తప్ప ఆయన సీక్వెల్స్ జోలికి వెళ్లనని తేల్చి చెప్పేసాడు. మరి ఈ లెక్కన బ్లాక్ బస్టర్ ఠాగూర్ సీక్వెల్ రాదని తెలుస్తుంది. ఇప్పుడు ఒక సినిమాకు సీక్వెల్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మొదటి సినిమాకు మించిన సబ్జెక్టు - స్క్రిప్ట్ ఉండాలి. మరి ఎలాగో ఠాగూర్ ఒరిజినల్ తెరకెక్కించిన ఏఆర్ మురుగదాస్ కూడా ఎప్పుడు ఠాగూర్(తమిళంలో రమణ) సీక్వెల్ పై స్పందించలేదు. కాబట్టి ముందుగా ఠాగూర్ విషయంలో ఏదైనా మొమోంట్ కనబడాలి అంటే మాత్రం దాని మాతృక తీసిన మురుగదాస్ నుండే రావాలంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News