ఈ జంట ఫ్లాట్ అద్దె జస్ట్15 లక్షలు

Update: 2018-03-13 05:06 GMT
రాజు తలుచుకుంటే దేనికి కొదవా అన్నట్టు కొత్త జంట విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ తమ ఆనందానికి ఏ మాత్రం హద్దులు పెట్టుకునే ఉద్దేశంలో లేరు. పెళ్ళైన తరువాత కూడా విపరీతమైన బిజీ షెడ్యూల్ గడుపుతున్న ఈ ఇద్దరు ముంబైలో ఒక కొత్త ఫ్లాట్ ని అద్దెకు తీసుకున్నారు. ఎంతకు అనుకున్నారు. జస్ట్ 15 లక్షలు. ఇది ఏడాదికి అయితే ఆశ్చర్యపోనక్కరలేదు కాని ఇది కేవలం ఒక నెల రెంటు. అయినా నో కాంప్రొమైజ్ అంటూ విరుశ్క జంట దీన్ని తీసేసుకున్నారు. అడ్వాన్సు పది నెలలు. అంటే కోటి 50 లక్షలు డిపాజిట్ కింద చెల్లించారు. దానికి తోడు రెంటల్ అగ్రిమెంట్ కోసం లక్ష రూపాయలకు పైగా అదనపు ఖర్చు. ఇంతా చేసి ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోరా అని అడగకండి. జస్ట్ 34వ అంతస్తు మాత్రమే. లిఫ్ట్ పైకి చేరేలోపు తాపీగా న్యూస్ పేపర్ ని ఒకసారి తిరగేయవచ్చు. అల్ట్రా ఫాస్ట్ మోడరన్ లిఫ్ట్ ఉన్న లగ్జూరియస్ అపార్ట్ మెంట్ అది.

ఈ వార్త విని బాలీవుడ్ బిగ్గీస్ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అయినా ఈ ఇద్దరికీ ఏం తక్కువని అద్దె కొంపలో ఉండాలి అనే డౌట్ ఫాన్స్ కు రావొచ్చు. దానికీ కారణం ఉందట. తమ డ్రీం హౌస్ నిర్మాణానికి కొంత సమయం అవసరం ఉండటంతో అప్పటి దాకా టెంపోరరి గా ఉండేందుకు ఇది తీసుకున్నారు. అగ్రిమెంట్ కూడా రెండు సంవత్సరాలకు మాత్రమే రాసుకున్నారు. అప్పటికి వీళ్ళ కలల సౌధం పూర్తి కాకపోతే రెన్యువల్ చేసుకుంటారు.ఇందులో మంత్లీ అపార్ట్ మెంట్ సర్వీస్ ఛార్జ్ వేరట. 25 వేల దాకా అదనంగా కట్టాల్సి ఉంటుంది. వింటే మైండ్ బ్లాంక్ అవుతోంది కదూ. అంతే మరి. ఇండియన్ క్రికెట్ టీం మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్, బాలీవుడ్ స్టార్ హీరొయిన్ కలిసి తీసుకున్న ఫ్లాట్ అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలి.
Tags:    

Similar News