మన దేశంలో క్రికెట్ కు - సినిమాకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. యువత ఈ రెంటినీ అమితంగా ఇష్టపడుతుంది. అలాగే క్రికెటర్లు సినిమాలు చూసి ఆనందం పొందుతారు. సినిమా వాళ్లు క్రికెట్ చూసి ఆనందిస్తారు. ఇక సినిమా హీరోయిన్లను ఇష్టపడి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు మన దేశంలో చాలామందే కనిపిస్తారు. అందులో సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కూడా ఒకడు. అతను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఒక దశలో వీళ్లిద్దరూ విడిపోయినట్లు కూడా వార్తలొచ్చాయి కానీ.. మళ్లీ ఆ బంధాన్ని పునరుద్ధరించుకుని పెళ్లితో ఇద్దరూ ఒకటయ్యారు. తన భార్య గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ అవుతాడు కోహ్లి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుష్క నటించిన సినిమాల గురించి కోహ్లి మాట్లాడాడు. ఆమె సినిమాల్లో తనకు అత్యంత ఇష్టమైంది ఏదో కూడా వెల్లడించాడు. ‘‘అనుష్క నటించిన చిత్రాలన్నింటిలోనూ నాకెంతో ఇష్టమైనది ‘ఏ దిల్ హై ముష్కిల్’. ఆ సినిమాలో తన పాత్రంటే నాకెంతో ఇష్టమని నేను ఎప్పుడూ అనుష్కకు చెబుతుంటాను. సమయం దొరికొనప్పుడు ఇంటర్నెట్ లో ఆ సినిమా చూస్తుంటాను. అందులో అనుష్కకు క్యాన్సర్ రావడం.. కొంత కాలం తర్వాత ఆమె తిరిగి రణబీర్ ను కలవడం.. చాలా హృద్యంగా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే పాట చూసినపుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది ఆ పాట నా హృదయాన్ని ద్రవింప చేస్తుంది’’ అని విరాట్ చెప్పాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్కతో పాటు రణబీర్ కపూర్ - ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రలు పోషించారు.