సినిమా రిలీజ్ లు అన్నీ మళ్లీ కన్ప్యూజన్ లో పడ్డాయి. థియేటర్ రిలీజ్ కి వెళ్లాలా? ఓటీటీకి వెళ్లిపోవాలా? అని ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ గందరగోళం నుంచి ఓటీటీ కంపెనీల బెస్ట్ ఆఫర్లతో నిర్మాతల్ని ఓ క్లారిటీ తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. దీంతో హీరోలు..నిర్మాతలు ఓటీటీ రిలీజ్ కే మొగ్గుచూపుతున్న సన్నివేశం కనిపిస్తోంది. ఇటీవలే హీరో సూర్య తన తదుపరి ప్రాజెక్ట్ లు అన్ని అమెజాన్ ప్రైమ్ లోనే రిలీజ్ అయ్యేలా బిగ్ డీల్ కుదర్చుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు బాలీవుడ్ నటి అనుష్క వర్మ ఇదే మార్గంలో వెళ్తున్నట్లు తేలింది.
ఇక టాలీవుడ్ దిగ్గజ నిర్మాత సురేష్ బాబు సైతం పాండిమిక్ ప్రారంభం దగ్గర నుంచి ఓటీటీకే మొదటి ఓటు వేస్తున్నారు. సినిమా భవిష్యత్ ని ముందే ఊహించే జాగ్రత్త పడే ప్లాన్ లో భాగంగా తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేసారు. ఈ నేపథ్యంలో ఆయన గత రెండు చిత్రాలు `నారప్ప`..`దృశ్యం-2` లను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేసారు. ఈ రెండు రిలీజ్ విషయంలో కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పటికీ ధైర్యంగా ముందుకెళ్లి సేఫ్ అయ్యారు. ఈ నేపథ్యంలో `విరాట పర్వం` చిత్రాన్ని కూడా అదే పార్మెట్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ కన్నా థియేటర్ రిలీజ్ అయితే బాగుంటుందని భావించడంతో ప్లాన్ మారింది.
ఆ తర్వాత విరాటపర్వం షూటింగ్ డిలే..ఇతర కారణాలు గా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాని మళ్లీ ఇప్పుడు ఓటీటీలోనే రిలీజ్ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నెట్ ప్లిక్స్ మంచి ఆఫర్ కూడా ఇచ్చిందిట. `విరాట పర్వం` కంటెంట్ కి థియేటర్ రిలీజ్ కన్నా ఓటీటీ రిలీజ్ అయితే సేఫ్ అని సురేష్ బాబు ఆలోచనలో పడి..చివరిగా నెట్ ప్లిక్స్ తో డీల్ కుదుర్చుకున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన` శ్యాంసింగరాయ్` థియేటర్లో ఫెయిలైంది. కానీ ఓటీటీలో సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఆ లెక్క సురేష్ బాబు ఆలోచనలో మార్పు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
కారణాలు ఏవైనా సురేష్ బాబు మొదటి నుంచి ఓటీటీ రిలీజ్ కే ప్రాధాన్యత ఇస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సీనియర్ నిర్మాత మాట నెగ్గినట్లు అయింది. `విరాట పర్వం` చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నక్సలైట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఇందులో రానాకి జోడీగా సాయిపల్లవి నటిస్తోన్న సంగతి తెలిసిందే.