ఉయ్యాల జంపాల చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన విరించి వర్మ మొదటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాడు. షార్ట్ ఫిల్మ్స్ తో మెప్పించిన విరించి వర్మ ఉయ్యాల జంపాల చిత్రం తర్వాత టాలీవుడ్ లో బిజీ డైరెక్టర్ అవుతాడని అంతా భావించారు. కాని ఈ ఆరు సంవత్సరాల్లో విరించి వర్మ కేవలం రెండే రెండు సినిమాలు చేశాడు. ఉయ్యాల జంపాల సక్సెస్ అవ్వగా రెండవ సినిమా మజ్ను పర్వాలేదు అన్నట్లుగా నడిచింది.
మజ్ను చిత్రం తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా తన వద్ద ఉన్న స్క్రిప్ట్ తో సనిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈయన హీరోల కోసం వెదికాడు. మొదట ఒక హీరోతో ఒక సినిమాను చేసేందుకు విరించి వర్మ ప్రయత్నించాడు. కథ చెప్పడం పూర్తి అయ్యిందట. కాని ఏదో కారణాల వల్ల ఆ హీరో ఆలస్యం చేస్తున్నాడని.. ఆ కారణంగానే మరో హీరో కోసం విరించి వర్మ ప్రయత్నాలు సాగిస్తున్నాడంటూ సమాచారం అందుతోంది. దాదాపు రెండు సంవత్సరాలుగా విరించి వర్మ ఆ హీరో కోసం వెయిట్ చేసి ఇప్పుడు మరో హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట.
మెగా హీరో వరుణ్ తేజ్ తో కూడా విరించి వర్మ చర్చలు జరుపుతున్నాడని.. కాని ఇంకా అవి ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. వరుణ్ తేజ్ తో సినిమా వర్కౌట్ కాకుంటే రాజ్ తరుణ్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. మొత్తానికి వచ్చే ఏడాదికి ఏదో ఒక సినిమాను మొదలు పెట్టాలని విరించి వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడట. మొదటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విరించి వర్మకు బ్యాడ్ టైం కారణంగానే సినిమాలు ఆలస్యం అవుతున్నాయంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది నుండైనా ఈ వర్మకు గుడ్ టైం స్టార్ట్ అవుతుందో చూడాలి.