కొత్త దర్శకులకు అవకాశాలివ్వడంలో.. కొత్త కథలతో సినిమాలు చేయడంలో తెలుగులో అక్కినేని నాగార్జున తర్వాతే ఎవరైనా. మూడు దశాబ్దాల కెరీర్లో నాగ్ ఎందరో కొత్త దర్శకులతో పని చేశాడు. ఇప్పుడు కూడా వారికే ఎక్కువ అవకాశాలిస్తున్నాడు. ఆయనతో పని చేయడానికి యువ దర్శకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఐతే ఒక యంగ్ డైరెక్టర్ మాత్రం నాగ్ తో సినిమాకు నో అన్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘ఉయ్యాల జంపాల’తో పరిచయమై ఇవాళ ‘మజ్ను’ సినిమాతో పలకరించిన విరించి వర్మ.
విరించి తొలి సినిమాకు నాగ్ కూడా ఒక నిర్మాత. ఆ సినిమాకు మరో నిర్మాత అయిన రామ్మోహన్ నాగ్ కోసం ‘సోగ్గాడే చిన్నినాయనా’ కథ రాసిన సంగతి తెలిసిందే. ఈ కథతో నాగార్జునతో సినిమా తీయమని రామ్మోహన్ విరించిని అడిగాడట. కానీ విరించి కుదరదని చెప్పేశాడట. తనకు తన కథతోనే సినిమా చేయాలనుందని.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ కథను డైరెక్ట్ చేయలేనని చెప్పేశాడట విరించి. దీంతో రామ్మోహన్ కళ్యాణ్ కృష్ణను అడగడం.. అతను ఓకే చెప్పడం.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ బ్లాక్ బస్టర్ హిట్టవడం.. అలా అలా జరిగిపోయాయి.
విరించి ఈ సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉండేదో మరి. ఐతే అతను అందుకేమీ రిగ్రెట్ కాలేదు. ఓ యువ కథానాయకుడికి ఓ యాక్షన్ లవ్ స్టోరీ చెప్పాడు. అతను ఒప్పుకోకుంటే ‘మజ్ను’ స్క్రిప్టు రెడీ చేసి నానికి చెప్పాడు. అది ఓకే అయింది. ఈ రోజే విడుదలైన ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.