విశాఖ సింగ్ గుర్తుంది కదా.. అప్పట్లో రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో ఓ సినిమా చేసి మాయమైన ఈ ముంబయి భామ.. ఈ మధ్యే నారా రోహిత్ 'రౌడీఫెలో' సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఆమెకు అంతగా గుర్తింపునివ్వకపోవడంతో తిరిగి కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మాయి ఈ మధ్య కొంచెం సెక్సీగా ఉన్న ఫొటో ఒకటి పెట్టింది. దాని మీద ట్విట్టర్ జనాలు హేట్ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. ఆమె క్లీవేజ్ గురించి.. చాలా దారుణమైన కామెంట్స్ పెట్టారు.
ఇలాంటి కామెంట్స్‌ను చూసి చూడనట్లు వదిలేస్తే పోయేది. కానీ విశాఖ సింగ్ ఆ జనాలకు గట్టిగా రిటార్ట్ ఇచ్చింది. మీ అమ్మలకు అక్కలకు వక్షోజాలు ఉండవా.. వాళ్ల గురించి కూడా ఇలాగే మాట్లాడతారా అని తిట్టిపోసింది. దీంతో వాళ్లు ఇంకా రెచ్చిపోయారు. దారుణమైన హేట్ కామెంట్స్ చేశారు. ఈ మాటల యుద్ధం చాలా దూరం వెళ్లి విశాఖ బాగా అప్సెట్ అయింది. చివరికి ఆ ఫొటోను డెలీట్ చేసి.. ట్విట్టర్‌కు బ్రేక్ ఇచ్చేసి పారిపోయింది. ఈ మధ్య హీరోయిన్లందరికీ ఎదురవుతున్న ఇబ్బందే ఇది. కొందరు వెర్రి అభిమానులు హీరోయిన్ల గురించి దారుణమైన కామెంట్స్ చేయడం.. వాళ్లు స్పందిస్తే మరింతగా రెచ్చిపోయి వాళ్లను అప్సెట్ చేయడం మామూలైపోయింది. ఇలాంటి వాళ్లను ఎంత ఇగ్నోర్ చేస్తే అంత మంచిదని హీరోయిన్లు గుర్తుంచుకుంటే బెటర్.