ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం రేసులో నిలిచిన తమిళ సినిమా ‘విసారణై’ ఫైనల్ రౌండు కంటే ముందు పోటీ నుంచి తప్పుకుంది. ఈ అవార్డుకు భారత్ తరఫున నామినేషన్ సంపాదించడం.. అవార్డు కోసం ఎంపిక చేసిన 29 విదేశీ చిత్రాల జాబితాలో చోటు దక్కడంతో భారతీయ సినీ ప్రేమికుల్లో ఆశలు రేపింది. అవార్డు గెలవకున్నా ఫైనల్ రౌండుకు వెళ్తుందని.. గట్టి పోటీ ఇస్తుందని ఆశించారు. కానీ అదేమీ జరగలేదు.
ఫైనల్ రౌండుకు ఫిల్టర్ చేసిన 9 సినిమాల జాబితాలో ‘విసారణై’కు చోటు దక్కలేదు. ధనుష్ నిర్మాణంలో అతడి మిత్రుడు వెట్రిమారన్ రూపొందించిన సినిమా ఇది. వెనిస్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై అవార్డు కూడా గెలుచుకున్న ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజై విమర్శకులు.. ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. ఆస్కార్ అవార్డుకు ఇండియా నుంచి ఎంట్రీ సంపాదించింది. ఆస్కార్ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనకు వెట్రిమారన్ కూడా హాజరయ్యాడు. కానీ ఈ సినిమా ముందంజ వేయలేకపోయింది.
ఐతే ఈ ఏడాది ఆస్కార్ అవార్డులపై ఇండియా ఆశలు ఆవిరైపోలేదు. ఇప్పటికే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు రెండు ఆస్కార్లు అందుకున్న స్వర మాంత్రికుడు ఈసారి ‘పీలే’ సినిమాకు గాను రెండు నామినేషన్లు సంపాదించాడు. అతను ఒరిజినల్ స్కోర్.. ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో పోటీ పడుతున్నాడు. అందులో ఒక్కటైనా రెహమాన్ కు దక్కకపోదని అభిమానుల ఆశ. ఫిబ్రవరి 26న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/