కొన్ని వరుస బ్లాక్ బస్టర్లతో సంచలనంగా మారాడు లోకేష్ కనగరాజ్. తమిళ దర్శకుడే అయినా అతడి పేరు తెలుగు సహా హిందీ పరిశ్రమలోను మార్మోగుతోంది. నిజం చెప్పాలంటే ప్రభాస్ .. విజయ్ .. కమల్ హాసన్ కి వచ్చినంత ఫాలోయింగ్ ఈ దర్శకుడికి అతికొద్ది సమయంలోనే వచ్చిందంటే అతిశయోక్తి కానే కాదు!!
కెరీర్ లో వరుస పెట్టి బ్లాక్ బస్టర్లు కొడుతూ సంచలనంగా మారాడు కనగరాజ్. ఇలాంటి కీలక దశలో అతడు క్రేజీ పాన్ ఇండియా స్టార్ విజయ్ తో సినిమాని లాంచ్ చేశాడు. డిసెంబర్ 5న అధికారికంగా ప్రారంభించిన 'దళపతి 67' జూన్ లో తన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ 'విక్రమ్' విడుదల సమయంలోనే లోకేష్ ధృవీకరించాడు. అప్పటి నుండి సోషల్ మీడియాలో నిరంతరం ఈ ప్రాజెక్ట్ ట్రెండింగ్ లో ఉంది.
దళపతి 67 కాస్టింగ్ మైండ్ బ్లోవింగ్! త్రిష - అర్జున్ - సంజయ్ దత్- మన్సూర్ అలీ ఖాన్- దర్శక నటులైన గౌతమ్ మీనన్ - మిస్కిన్ తారాగణంలో చేరారని కూడా టాక్ వినిపిస్తోంది. ఉలగనాయగన్ కమల్ హాసన్ సైతం ఈ చిత్రంలో ఒక మెరుపు లాంటి అతిథి పాత్రలో కనిపించే ఛాన్సుందని గుసగుస వినిపిస్తోంది. 2023-24 సీజన్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ఇది చర్చల్లోకి వచ్చింది.
అయితే ఇందులో పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్ర కోసం ట్యాలెంటెడ్ హీరో విశాల్ ని కూడా సంప్రదించారని.. కానీ అతడు అంగీకరించలేదని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే దీనిపై విశాల్ ఓ చాటింగ్ సెషన్ లో ఓపెనయ్యారు. లోకేష్ కనగరాజ్ తనను కలిసి స్క్రిప్ట్ వివరించారని అయితే బల్క్ డేట్ లు కేటాయించాల్సిన అవసరం ఉన్నందున తిరస్కరించాల్సి వచ్చిందని తెలిపాడు. లాఠీ (లత్తి) ప్రమోషన్స్ సహా 'మార్క్ ఆంటోనీ' మూవీ కోసం అలాగే ఇతర భవిష్యత్ కమిట్ మెంట్ ల కోసం ఈ క్రేజీ ఆఫర్ ని వదులుకున్నానని తెలిపాడు.
అయితే దళపతి విజయ్ ని తాను డైరెక్ట్ చేయాలనే కోరికను విశాల్ వ్యక్తం చేశాడు. ఏదో ఒక రోజు విజయ్ ని కలుసుకుంటానని .. చాలా కాలంగా తన మనసుకు దగ్గరగా ఉన్న స్క్రిప్ట్ ను వివరిస్తాడని నమ్మకంగా ఉన్నాడు. తాను చాలా కాలంగా దళపతికి హార్డ్ కోర్ ఫ్యాన్ అని 'తుప్పరివాలన్ 2' (విశాల్ దర్శకుడు.. హీరో) షూటింగ్ పూర్తి చేసిన తర్వాత అతనిని సంప్రదిస్తానని చెప్పాడు.
విలన్ గా చేయడం ఇష్టం లేకేనా?
అంతేకాదు హీరో విశాల్ కు లోకేష్ ఆఫర్ చేసిన పాత్ర విలన్ పాత్ర అని కూడా గుసగుసలు వినిపించాయి. ఒక సోర్స్ ప్రకారం... విశాల్ ఇప్పటికీ హీరో పాత్రలు చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతానికి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించేందుకు ఇష్టపడటం లేదని కూడా గుసగుస వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.