విశాల్.. తెలుగు చిత్రసీమకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. గతంలో హీరో విశాల్ తో డైరెక్టర్ మిస్కిన్ తెరకెక్కించిన 'డిటెక్టీవ్' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాను హీరో విశాల్ సొంతం బ్యానర్ లో నిర్మించడంతో దీనికి రెండో పార్ట్ కూడా తీస్తానని ప్రకటించాడు. అయితే డిటెక్టీవ్-2 సినిమా గురించి గత కొన్ని నెలలుగా విశాల్-మిస్కిన్ ల మధ్య వివాదం జరుగుతూనే ఉంది. తాజాగా డైరెక్టర్ మిస్కిన్ ఈ వివాదం పై స్పందించి కొన్ని విషయాలను బయటపెట్టాడు.
హీరో విశాల్ కి మొదట డిటెక్టీవ్-2 కథ చెప్పినప్పుడు భారీ బడ్జెట్ అవుతుందని చెప్పాడట. అయితే హీరో విశాల్ ఎంత బడ్జెట్ అయినా తన సొంత బ్యానర్ లో నిర్మిస్తానని అన్నాడట. ఆ వెంటనే మిస్కిన్ వద్దు సార్.. వేరే నిర్మాతతో చేద్దాం.. అంటే విశాల్ పర్లేదు నేనే నిర్మిస్తా.. అన్నాడట. తీరా సినిమా షూటింగ్ మొదలయ్యాక హీరో విశాల్ భారీ బడ్జెట్ ని పెట్టలేనని చేతులెత్తేశాడట. అందుకే నేను సినిమా నుండి తప్పుకున్నానని మిస్కిన్ వివరించాడు. అయితే ఈ సినిమా విషయంపై విశాల్ మాత్రం నేను భారీ రెమ్యూనరేషన్ అడిగినట్లు ఆరోపణలు చేసాడని మిస్కిన్ కోలీవుడ్ మీడియా ముఖంగా విశాల్ ని కడిగేసాడు. అంతేగాక ఇలాంటి వాళ్ళతో పనిచేయడం కష్టమని తానే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని.. మిస్కిన్ వివరించాడు. కానీ మిస్కిన్ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? విశాల్ మాటల్లో ఎంతవరకు నిజం ఉందనేది? పెద్ద ప్రశ్న..