విశాల్ ఆమెతో ఒక్కటయ్యే వేళాయెరా!

Update: 2016-09-02 04:40 GMT
కోలీవుడ్ హీరో విశాల్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ లవ్ స్టోరీ నడిపించేశాడు. వరుస హిట్స్ తో జోరుమీదున్న ఈ హీరో.. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడన్నది ఓపెన్ సీక్రెట్. అందరికీ తెలిసినా సీక్రెట్ అని ఎందుకు అనాలంటే.. ఈ విషయాన్ని విశాల్ గానీ.. వరలక్ష్మి గానీ అవునని చెప్పరు.. కాదని ఖండించరు. వీళ్ల పెళ్లి శరత్ కుమార్ కి ఇష్టం లేదన్నది కూడా మరో బహిరంగ రహస్యమే.

అన్ని రకాలుగానూ వీరిద్దరూ సెటిల్డ్ అయినా పెళ్లి విషయంలో మాత్రం అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఇందుకు కారణం.. రాధిక కూతురు(శరత్ కుమార్ కూతురు కాదు) రయానే. రీసెంట్ గా ఆమెకు క్రికెటర్ అభిమన్యు మిథున్ తో గ్రాండ్ గా పెళ్లి జరిపించేశారు. ఇప్పుడామె పెళ్లితో శరత్ కుమార్ కూతురు(రాధిక కూతురు కాదు) వరలక్ష్మికి లైన్ క్లియర్ అయిపోయింది. విశాల్ తన తండ్రికి శతృవు టైపు అయినా.. కుర్రాడితో పెళ్లికి అమ్మడు రెడీనే అంటారు తమిళ సినీ జనాలు.

త్వరలో తాను పెళ్లి చేసుకుంటున్నట్లు విశాల్ ఈ మధ్య ఓ చిన్న క్లూ వదిలాడు. గతంలో నడిగర్ సంఘం బిల్డింగ్ లో జరిగే మొదటి పెళ్లి అని కూడా చెప్పిన విశాల్.. ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడని టాక్. శరత్ కుమార్ ని ఒప్పించేందుకు  వరలక్ష్మి కూడా గట్టిగానే ట్రై చేస్తోందట. అన్నీ సెట్ అయితే.. 2017 సంక్రాంతి పండగే విశాల్-వరలక్ష్మిలు ఒక్కటయ్యే వేళ అవుతుంది.
Tags:    

Similar News