పాలిటిక్స్ ఎంట్రీ పక్కా అంటున్నా హీరో

Update: 2017-09-11 07:36 GMT
ఎక్కువగా రాజకీయాలంటే గుర్తొచ్చేది తమిళనాడు అనే చెప్పాలి. ఊహకందని ట్విస్ట్ లతో అక్కడే జరిగే రాజకీయ పరిణామాలు ఇంకెక్కడా జరగవనేది అందరికి తెలిసిన విషయమే. ఇక అక్కడి పాలిటిక్స్ కి సినిమా పరిశ్రమ కి ఎన్నో ఏళ్లుగా కనెక్షన్ ఉంది. కోలీవుడ్ లో స్టార్స్ గా ఎదిగిన చాలామంది నటీనటులు రాజకీయలవైపు అడుగులు వేస్తూనే ఉన్నారు. గత కొంత కాలంగా రజినీకాంత్ కూడా రాజకీయా ప్రస్థావనని బాగానే తెస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆ రాజకీయాల్లోకి హీరో విశాల్ కూడా దిగబోతున్నట్లు చెప్పేశాడు. కానీ ఎప్పుడూ రంగప్రవేశం అనే విషయాన్ని మాత్రం ఫైనల్ చేయలేదు. రీసెంట్ గా విశాల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజకీయ ప్రస్థావన రాగానే.. అందరిలా తను దైవ నిర్ణయం అని అనుకొనని చెబుతూ.. టైమ్ వస్తే పాలిటిక్స్ లోకి తప్పకుండా ఎంట్రీ ఇస్తానని ఏ మాత్రం సందేహం లేకుండా కరెక్ట్ గా చెప్పాడు. అలాగే అందులో తప్పు కూడా లేదని సమాధానం ఇచ్చాడు.

విశాల్ ప్రస్తుతం నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ గా మరియు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అలాగే అప్పుడప్పుడు కొన్ని సమస్యలపై విశాల్ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తనదైన ముద్ర వేసుకోవాలని చూస్తున్నాడు. మరీ విశాల్ కోలీవుడ్ లో హీరోగా సక్సెస్ అయినట్టే పొలిటీషియన్ గా కూడా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.


Tags:    

Similar News