శరత్ కుమార్ ను విశాల్ వదల్లేదుగా..

Update: 2018-06-30 05:45 GMT
తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ చిక్కుల్లో పడ్డాడు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నపుడు అతను ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ కుమార్ పై తమిళనాడు పోలీసులు కేసు పెట్టారు. నడిగర్ సంఘానికి చెందిన 26 సెంట్ల స్థలాన్ని శరత్ కుమార్ అండ్ టీమ్ విక్రయించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం విశాల్ నాయకత్వంలో నడుస్తున్న నడిరగ్ సంఘం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ స్థలం విక్రయానికి సంబంధించిన లెక్కలలో పలు అక్రమాలు జరిగాయని విశాల్ అండ్ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్.. కోశాధికారి రాధారవిలతో పలువురిపై కేసు నమోదు చేశారు.

శరత్ కుమార్ నాయకత్వంలోని నడిగర్ సంఘం కార్యవర్గం ఒకప్పుడు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది వ్యవహారం. వాళ్లను విశాల్ ఎదిరించాడు. నాజర్.. కార్తి.. లాంటి వాళ్లను కలుపుకుని శరత్ అండ్ టీంపై తిరుగు బావుటా ఎగురవేశాడు. ఐతే అప్పటికి విశాల్ చిన్న స్థాయి హీరోనే. అతడిని లైట్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత విశాల్ నిజాయితీగా పోరాడి అందరిలోనూ కదలిక తెచ్చాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో తన టీంను గెలిపించుకున్నాడు. శరత్ కుమార్ అండ్ టీంను వదిలే ప్రసక్తే లేదని ముందే ప్రకటించిన విశాల్.. ఎన్నికల తర్వాత వాళ్లను లైట్ తీసుకోలేదు. ఇప్పుడు శరత్ బృందంపై కేసులు కూడా పెట్టించాడు. ఏ విషయాన్నీ అంత తేలిగ్గా వదలడని పేరున్న విశాల్.. శరత్ కుమార్ ను ఇంకెంత ఇబ్బంది పెడతాడో చూడాలి. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో విశాల్ ప్రేమలో ఉన్నట్లు ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆమెతో ప్రేమ సంగతిని విశాల్ ఖండించాడు.
Tags:    

Similar News