మరోసారి గాయాలపాలైన విశాల్

Update: 2022-07-12 10:30 GMT
తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్న విశాల్ ఒకప్పుడు వరుస విజయాలతో మంచి లాభాలను అందుకున్నాడు. ప్రతి సినిమాను కూడా వీలైనంతవరకు తన సొంత ప్రొడక్షన్ లోనే తెరపైకి తీసుకువచ్చే విశాల్ ఇటీవల కాలంలో మాత్రం వరుసపజయాలతో తీవ్ర స్థాయిలో నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అతని హార్డ్ వర్క్ మాత్రం మరవలేదు.

తప్పకుండా మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని ఎప్పటిలానే యాక్షన్ సన్నివేశాల కోసం కష్టపడుతున్నాడు. విశాల్ తన సినిమాల్లో చాలావరకు డూప్ లేకుండానే యాక్షన్స్ సీన్స్ లో నటిస్తాడు. గతంలో చాలా సినిమాలకు అతను దెబ్బలు కూడా తగిలించుకున్నాడు. విశాల్ ఎలాంటి యాక్షన్ సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక ఎపిసోడ్లో నిజంగానే దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాడు.

కొన్నిసార్లు గాయాలతోనే షూటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల లాఠీ సినిమా షూటింగ్లో మాత్రం విశాల్ పదే పదే గాయాల పాలవుతున్నారు. ఆమధ్య విశాల్ ఒక పాపను కాపాడే సీన్ బిల్డింగ్ పైనుంచి జారి కింద పడడంతో ఎడమ చేతికి అలాగే కాలికి కూడా ఫ్రాక్చర్ అయింది.

దీంతో కొన్ని వారాలపాటు రెస్టు తీసుకోవాల్సి వచ్చింది. ఇక రీసెంట్గా మరొకసారి 30 మంది ఫైటర్లతో యాక్షన్స్ సమావేశం చేస్తూ ఉండగా కొన్ని దెబ్బలు తగిలినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈసారి గాయాలు ఎక్కువ కావడంతో షూటింగ్ చేయలేని పరిస్థితి ఎదురయ్యింది. VFX పనులు కూడా చాలావరకు బ్యాలెన్స్ ఉండడంతో చిత్ర యూనిట్ సభ్యులు మరోసారి విడుదలతే దీని వాయిదా వేశారు. అసలైతే లాఠీ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు విశాల్ కు కొంత గ్యాప్ అవసరమని..

అలాగే మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది కాబట్టి సినిమా రిలీజ్ డేట్ ను మార్చేస్తున్నారు. ఫైనల్ గా సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఇటీవల అఫీషియల్ ప్రకటించారు.
Tags:    

Similar News