తమిళంలో స్టార్ హీరోగా ఎదిగిన తెలుగు కుర్రాడు విశాల్.. నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నాడు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా సరిగా పని చేయని శరత్ కుమార్ మీద తిరుగుబావుటా ఎగరేసి.. ఎన్నికల్లో అతణ్ని ఢీకొట్టి గెలిచాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో సెక్రటరీగా గెలిచాక నాజర్.. కార్తిలతో కలిసి చాలా మంచి కార్యక్రమాలు చేపట్టి అందరి మనసులూ గెలిచాడు. తనపై విమర్శలు గుప్పించడం.. ఎన్నికల్లో ఓడించడం.. ఆ తర్వాత తనకు చేతకాని మంచి పనులు చేపట్టడం ద్వారా తన విలువను మరింత తగ్గించడం.. ఇలా శరత్ కుమార్ కు విశాల్ వల్ల తలెత్తిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ చాలవన్నట్లు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమాయణం కూడా నడిపి అతడికి కంట్లో నలుసులా తయారయ్యాడు విశాల్.
విశాల్-వరలక్ష్మి లవ్ స్టోరీ గురించి కోలీవుడ్లో తెలియనివాళ్లు లేరు. అయినప్పటికీ ఆ విషయాన్ని విశాల్ కానీ.. వరలక్ష్మి కానీ.. బహిరంగంగా ఆ విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకుంది లేదు. ఐతే తాజాగా వరలక్ష్మితో కలిసి చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన విశాల్.. ‘‘దట్స్ ఇట్’’ అని వ్యాఖ్యానించాడు. దీంతో విశాల్ ఏం చెప్పదలుచుకున్నాడో అందరికీ అర్థమైంది. ఐతే విశాల్ ఈ ట్వీట్ చేసిన సమయంలోనే శరత్ కుమార్ అనారోగ్యం పాలవడం గమనార్హం. అతడికి హార్ట్ అటాక్ అని ప్రచారం జరిగింది. తర్వాతేమో ఫుడ్ పాయిజన్ వల్లే అనారోగ్యం పాలైనట్లు వార్తలొచ్చాయి. ఐతే జనాలు మాత్రం విశాల్ ట్వీట్ వల్లే శరత్ అనారోగ్యం పాలయ్యాడంటూ చర్చించుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతైనప్పటికీ విశాల్-వరలక్ష్మిల పెళ్లికి శరత్ ఆమోదం లేదన్నది మాత్రం నిజం.